నాటిన మొక్కలను సంరక్షించాలి: ఎమ్మెల్యే


Mon,August 12, 2019 10:48 PM

తాండూరు రూరల్: హరితహారం అందరి బాధ్యతని, నాటిన మొక్కలను సంరక్షించాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మండలం బెల్కటూర్ గ్రామంలో సర్పంచ్ మధన్‌మోహన్ ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలకు తగ్గకుండా నాటాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నామని, ఆ లక్ష్యం దిశగా అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్నపెద్ద తేడా లేకుండా మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...