అనారోగ్యంతో ఉప సర్పంచ్ మృతి


Sun,August 11, 2019 10:42 PM

బషీరాబాద్: మైల్వార్ ఉప సర్పంచ్ పార్వతమ్మ(55) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం తాండూరులోని ఓ ప్రయివేట్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆరు నెలల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గ్రామంలోని మూడో వార్డు నుంచి పార్వతమ్మ వార్డు సభ్యురాలిగా ఎన్నికైయ్యారు. వార్డు సభ్యులందరూ కలిసి ఆమెను ఉప సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. పార్వతమ్మ మృతి పట్ల గ్రామ సర్పంచ్ సీమసూల్తానా, మాజీ వైస్ ఎంపీపీ ఖాలీద్, వార్డు సభ్యులు సంతాపం తెలిపారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...