మట్టి గణపతులనే ప్రతిష్ఠించాలి


Sun,August 11, 2019 10:41 PM

- హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కృష్ణపంతులు
వికారాబాద్, నమస్తే తెలంగాణ : రసాయనాలతో తయారు చేసిన విగ్నే శ్‌లను కాకుండా మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కృష్ణపంతులు తెలిపా రు. ఆదివారం పట్టణంలోని శ్రీ రామ మందిరం ఆవరణలో హిందూ ఉత్స వ కమిటీ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉత్సవాలను సంప్రదాయ బద్ధంగా ప్రత్యే క పూజలు నిర్వహించి ఉత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.

వినాయక చవితి విగ్రహాల సైజులను చిన్నవిగా వినియోగించాలని, 5 ఫీట్ల కంటే తక్కువగా ఉండాలన్నారు. రసాయన పదార్థాలతో తయారు చేసే విగ్రహాలను వినియోగిస్తే చెరువుల్లో నీళ్లు కాలుష్యం ఏర్పడుతుందన్నారు. మట్టితో తయారు చేసిన విగ్రహాలను వినియోగించి వివిధ రకాల పువ్వులు, మట్టి సహజ సిద్ధంగా నీటిలో కలిసి వాతావరణ కాలుష్యం ఏర్పడదని ఆయన తెలిపారు. రెండేండ్ల నుంచి వివిధ సేవా సంస్థలు మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ బ్యాన ర్లు, ప్లేట్లు, గ్లాసులను వినియోగించవద్దన్నారు. బట్టతో తయారు చేసిన బ్యానర్లు తయారు చేసుకోవాలన్నారు. 40 ఏండ్లుగా ఉత్సవ కమిటీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...