ముమ్మరంగా వాహనాల తనిఖీలు


Sun,August 11, 2019 10:39 PM

పెద్దేముల్ : బక్రీద్ పండుగ నేపథ్యంలో వివిధ చెక్ పోస్టుల్లో పోలీసులు ఆదివారం ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేశారు. పెద్దేముల్ మండల కేంద్రంతో పాటు మంబాపూర్ గ్రామంలో బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఆవుల అక్రమ రవాణా జరుగకుండా ముందస్తుగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి రాకపోకలు జరిపే అన్ని వాహనాలను పోలీసులు తనిఖీలు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా పెద్దేముల్ ఎస్‌ఐ వి.సురేశ్ మాట్లాడుతూ.. ముస్లింల బక్రీద్ పండుగ నేపథ్యంలో పెద్దేముల్, మంబాపూర్ గ్రామాల్లో ముందస్తుగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వచ్చిపోయే వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేయడం జరుగుతుందని, ముఖ్యంగా ఆవుల అక్రమ రవాణాను అరికట్టడానికి చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, తనిఖీ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఆవులను అక్రమ రవాణా చేయడానికి వీలులేదని, ఒకవేళ ఎవరైన ఆవుల అక్రమ రవాణా చేస్తే వారిపైన చట్టా రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...