వీధిదీపాల ఏర్పాటు


Sun,August 11, 2019 10:39 PM

తాండూరు రూరల్: మండలంలోని అంతారం గ్రామంలో సర్పంచ్ రాములు ఆధ్వర్యంలో ఆదివారం ప్రతి వీధి స్తంభానికి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతి స్తంభానికి వీధిదీపాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పాత వాటి స్థానంలో కొత్త విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జీవరత్నం, తదితరులు ఉన్నారు.

కరణ్‌కోటలో...
అదేవిధంగా కరణ్‌కోట గ్రామంలో ఉపసర్పంచ్ హేమంత్‌కుమార్ ఎల్‌ఈడీ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయించారు. గ్రామంలోని ప్రతి వీధిలోని స్తంభానికి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...