దోమల నివారణపై అవగాహన


Sun,August 11, 2019 10:38 PM

వికారాబాద్ టౌన్ : మోమిన్‌పేట మండల పరిధిలోని దుర్గం చెరువు గ్రామంలో దోమల నివారణపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బృందం సభ్యులు వెంకట్, శ్రీనివాస్, బుజంగం, సుందర్‌రాజు, రాకేశ్, చింటు, అశోక్, ప్రభాకర్, రమేశ్, లక్ష్మణ్ ఆదివారం దుర్గం చెరువు గ్రామ సర్పంచ్ హరిశంకర్‌తో కలిసి గ్రామంలో తిరుగుతూ దోమల నివారణపై అవగాహన చేస్తూ, దోమల నివారణ మందు పిచికారీ చేసి చూపించారు. గ్రామంలో దోమలు విపరీతంగా పెరిగిపోవడంతో సర్పంచ్ గ్రామంలో దోమల నివారణకు నడుము బిగించారు. జీహెచ్‌ఎంసీ సభ్యులతో సర్పంచ్ వివరించడంతో గ్రామంలో దోమల నివారణకు పిచికారీ చేయాల్సిన మందును తీసుకొని మురుగునీరు నిల్వ ఉండేచోట మందును పిచికారీ చేశారు.

గ్రామంలోని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ఇలాంటి చర్యలు తీసుకుంటుండంతో గ్రామ ప్రజలు సర్పంచ్‌ను అభినందించారు. దోమలు విపరీతంగా పెరిగి విషజ్వారాల భారిన ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా గ్రామంలో దోమల నివారణకు తగిన చర్యలు తీసుకునేందుకు ముందుకు రావడం జరిగిందని సర్పంచ్ తెలిపారు. బృందం సభ్యులు గ్రామస్తులకు ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించారు. ఎవరి ఇంటి ముందు వారు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కుషల్‌కుమార్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...