కేజీబీవీని సందర్శించిన ఎమ్మెల్యే


Sun,August 11, 2019 10:38 PM

దౌల్తాబాద్: విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట గ్రామంలోని శనివారం ఉదయం కలుషిత ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత గురైన నేపథ్యంలో కేజీబీవీని ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా వసతిగృహంలో నెలకొన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకుని అస్వస్థతకు గురైన విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాసిరకంగా ఉన్న ఏ సరుకైన వాడవద్దని సుచించారు.

ఎట్టిపరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు ఇకముందు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కలుషిత ఆహారం తిని దాదాపు 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన చోటుచేసుకుందని, వెంటనే కస్తూర్బాగాంధీ పాఠశాలలో స్వచ్ఛత, పరిశుభ్రత, మరుగుదొడ్ల దగ్గర లీకేజీలు, పాఠశాల ఆవరణలో నీటి గుంత, అపరిశుభ్ర లేకుండా చూ డాలని జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి ఆదేశించారు. వారితో పాటు కొడంగల్ సీఐ నాగేశ్వర్‌రావు, దౌల్తాబాద్ ఎస్‌ఐ సతీశ్, దౌల్తాబాద్ జడ్పీటీసీ కోట్ల మహిపాల్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ప్రమోద్‌రావు, మాజీ జడ్పీటీసీ మోహన్‌రెడ్డి, మధుసుధన్ యాదవ్, సర్పంచ్ పార్వతమ్మ, ఎంపీటీసీ బసంతమ్మ, లింగప్ప, దస్తప్ప, వెంకటయ్య తదితరులు పాల్గొన్నా

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...