మార్కెట్ కమిటీని అభివృద్ధి చేయాలి


Sun,August 11, 2019 10:37 PM

మర్పల్లి : మార్కెట్ కమిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని ఎమ్యెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అ న్నారు. ఆదివారం వికారాబాద్‌లోని ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయంలో మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన వివిధ రకా ల పంటల ఉత్పత్తులను కొనుగోలు చేయుటకు కేంద్రాలు ఏర్పాటు చేసి సమర్థవంతంగా నిర్వహించే విధంగా చూడాలని కమిటీ సభ్యులకు సూచించారు. విత్తనాలు వేసినప్పటి నుంచి పంటచేతికి వచ్చేంత వరకు కష్టపడి పండించిన ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకువచ్చిన రైతులకు తూకాల్లో అవకతవకలు లేకుండా చూడాలన్నారు.

ధాన్యం మిల్లుల నిర్వహణపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంచాలని, టాక్స్ వసుళ్లు సమర్థ్ధవంతంగా చేయాల న్నారు. మోమిన్‌పేట, మర్పల్లి, బంట్వారం మండలాల్లోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మధుకర్, పార్టీ మం డల అధ్యక్షుడు సురేశ్‌కుమార్, వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహబూబ్ అలీ, ఎంపీటీసీ మల్లేశం, మార్కెట్ కమిటీ డైరెక్ట ర్లు, సభ్యులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...