అక్రమాలకు చెక్


Sat,August 10, 2019 11:13 PM

-మధ్యాహ్న భోజన బియ్యం పంపిణీకి
- ఈ -పాస్ విధానం అమలు
-పాఠశాలలు,అంగన్‌వాడీ, హాస్టళ్లకు
-ఈ -పాస్‌తో సన్నబియ్యం పంపిణీ
-జిల్లాలో 99,454 మంది విద్యార్థులకు మేలు
-నెలకు 450 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా
-పాఠశాలలు, విద్యార్థుల వివరాలను సేకరిస్తున్న విద్యాశాఖ
-హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు,తల్లిదండ్రులు

వికారాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం సర్కా రు పాఠశాలలో విద్యార్థులకు నాణ్య మైన విద్యతో పాటు సన్నబియ్యంతో భోజనాన్ని అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా సర్కారు పాఠశాలలకు, అంగన్‌వాడీలు, హాస్టళ్లకు సన్నబియ్యంతో భోజనం అందించి విద్యార్థులు నిత్యం పాఠశాలకు వచ్చేందుకు ప్రోత్సహిస్తూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్యపై ఆసక్తి పెంచేందుకు అన్ని విధాలా ప్రోత్సహిస్తుంది.అందులో భాగంగా ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు ఈ పాస్ విధానం ద్వారా విద్యార్థులకు సరైన విధంగా భోజనం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఈ పాస్ విధానంపై సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చింది.
ఈ విధానాన్ని ఆగస్టు నెల నుంచి జిల్లాలో పక్కాగా అమలు చేసేందుకు పాఠశాలల వివరాలు, విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నారు. పాఠశాలలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తూ విద్యార్థులకు ఈ పాస్ ద్వారా బియ్యాన్ని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

కొన్ని పాఠశాలలో పిల్లలు అధికంగా ఉన్నారని చూపించి బియ్యాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని క్షేత్ర స్థాయి పరిశీలనలో తేలింది. దీంతో అక్రమాలకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సెల్) ఈ పాస్ విధానంతో ఆగస్టు 1వ తేదీ నుంచి సరఫరా చేస్తున్నారు. ఈ విధానంలో హైదరాబాద్ నుంచే పర్యవేక్షించే అవకాశం ఉంది. పౌరసరఫరాల శాఖ ఇందుకు తగిన కార్యచరణ రూపొందించి నగరంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి జిల్లాలోని వివరాలు సేకరించి దీని అమలుపై పర్యవేక్షణ చేయనున్నారు. జిల్లాలోని 18 మండలాల్లో 131 పాఠశాలల్లో 99,454 మంది విద్యార్థు లు విద్యనభ్యసిస్తున్నారు.ఈ విధానంలో ప్రతి పాఠశాల దరఖాస్తు చేసుకుంటే పాస్‌వర్డ్ ఇస్తారు. దీని ద్వారా ఆ పాఠశాలకు సంబంధించి ధాన్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రాథమిక పాఠశాలలో 48,349,ప్రాథమికోన్నత పాఠశాలలో 31,129, ఉన్నత పాఠశాలల్లో 19,976 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అదే విధంగా 1,107 అంగన్‌వాడీ కేంద్రాల్లో 50,393 మంది చిన్నారులు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. వీరందరికి జిల్లాలో నెలకు 450మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తుంది.ప్రభుత్వ ఎడెడ్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్నబియ్యం, గుడ్డుతో కూడిన పౌష్టికాహార భోజనం పెడుతున్నారు. వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు అంగన్‌వాడీలు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలకు విద్యార్థుల సంఖ్యను ఆధార్‌తో అనుసంధానం చేసి ఈ పాస్ విధానంతో అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు తూకం తేడాలు రాకుండా ఉండేందుకు ఈ పాస్ విధానం ఎంతో మేలు చేస్తుంది.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...