ఆర్‌పీఎఫ్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన చీఫ్ సెక్యూరిటీ కమిషనర్


Sat,August 10, 2019 11:09 PM

వికారాబాద్ టౌన్ : వికారాబాద్ పట్టణంలోని రైల్వే ప్రొటక్షన్‌ఫోర్స్ పోలీస్‌స్టేషన్‌ను శనివారం సౌత్ సెంట్రల్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఈశ్వర్‌రావు ఆకస్మీక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వికారాబాద్ రైల్వేస్టేషన్‌లో పరిసరాలను పరిశీలించారు. సీసీ టీవీల పనితీరు, విశ్రాంతి స్థలం, స్టేషన్ బయటి పరికరాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్‌స్టేషన్ సమీపంలో మొక్కలు నాటారు. అనంతరం సిబ్బందితో విధి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...