పేదలకు చేయూత అభినందనీయం


Sat,August 10, 2019 11:09 PM

తాండూరు, నమస్తే తెలంగాణ: సమాజసేవలో భాగంగా స్వచ్ఛంద, కుల సంఘాలు పేదలకు చేయూతనివ్వడం అభినందనీయమని తాండూరు డీఎస్పీ రామచంద్రుడు అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మంటపంలో ఆర్యవైశ్య సంఘం, లయన్స్‌క్లబ్ తాండూరు శాఖ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు, విద్యార్థుల ఫీజులతో పాటు కుటుం బ పోషనకు రూ. 4 లక్షల విలువైన వస్తువులను అందజేశారు.

ఈ సందర్భం గా డీఎస్పీ రామచంద్రుడు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్నా రు. మనకు ఉన్నదాంట్లో తోటి వారికి సహాయం చేయడంలో ఉన్న ఆనందం మరెక్కడ ఉండదన్నారు. ఆపదలో ఉన్న వారికోసం స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు ముందుకు వచ్చి ఆదుకోవడం చాలా సంతోషమన్నారు. సహాయం పొందినవారు చక్కగా ఉంటు కుటుంబంలోని సమస్యలను తొలిగించుకునేందుకు ఇష్టంతో కష్టపడుతూ బాగుపడాలన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు కుంచం మురళీ, తాటికొండ వినోద్, పరిమళ్, లయన్స్‌క్లబ్ ప్రతినిధులు రవీందర్‌రెడ్డి, డాక్టర్ సుధాకర్ పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...