మండలంలో జోరుగా వరినాట్లు


Sat,August 10, 2019 11:08 PM

యాలాల: మండలంలో వానకాలం వరినాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వరినాట్లు బోర్లు, బావుల కింద మాత్రమే సాగవుతున్నాయి. వర్షా కాలం ప్రారంభమై రెండున్నర నెలలు కావస్తున్నప్పటికీ చెరువులు, కుంటల్లో నీరు వచ్చి చేరలేదు. దీంతో చెరువులు, కుంటల ఆయకట్టు బీడుగానే మిగిలింది. దీంతో ఆయకట్టు రైతులు వానకాలం వరిపై ఆశ వదులుకున్నారు. మండలంలో సాధారణంగా వరిని 5,196 ఎకరాల్లో పండిస్తారు. అయితే చెరువులు, కుంటల్లో నీరు రాకపోవడంతో బోర్లు, బావుల కింద మాత్రమే రైతులు వరిని సాగుచేస్తున్నారు.

చెరువులు, కుంటలల్లో నీరు రాక పోవడంతో మండలంలో వరి సాగు 4,236 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆయకట్టు వృథాగా ఉండటంతో రైతులు వానకాలం వరి సాగుపై ఆశలు వదులు కున్నారు. వర్షాకాలం ఇలాగే ఉంటే మండలంలో వరి సాగు తక్కువయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మెట్ట పంటలకు మాత్రమే అనుకూలంగా ఉందని రైతులు పేర్కొంటున్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...