ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి


Sat,August 10, 2019 11:07 PM

బొంరాస్‌పేట : హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను సంరక్షించాలని ఎంపీడీవో హరినందనరావు అన్నారు. శనివారం మండలంలోని కొత్తూరు నర్సరీలో పలు గ్రామాలకు ఇండ్లవద్ద నాటుకునేందకు పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం మహంతీపూర్‌లో సర్పంచ్‌తో కలిసి మహిళలు, గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మొక్కలు ఎక్కువగా నాటి వాటిని కాపాడితే అడవులు పెరిగి పచ్చదనం పెరుగుతుందన్నారు. దీంతో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అన్నారు. అడవుల శాతాన్ని పెంచడానికే ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందని, మహిళలు ఇండ్లవద్ద పండ్ల మొక్కలు, రైతులు పొలాల వద్ద టేకు మొక్కలు నాటుకోవాలని హరినందనరావు సూచించారు. టేకు మొక్కలను నాటితే భవిష్యత్‌లో రైతులకు మంచి ఆదాయం వస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఏపీవో రజనీకాంత్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. తుంకిమెట్లలో టీఆర్‌ఎస్ నాయకులు రాజేశ్వర్‌రెడ్డి, మోనాచారి, మల్లేశ్‌గౌడ్, నెహ్రూనాయక్ మొక్కలు నాటారు. ఎనికేపల్లిలో అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు.

నాటిన ప్రతి మొక్కను కాపాడాలి
కొడంగల్, నమస్తే తెలంగాణ : నాటిన ప్రతి మొక్కను కాపాడాలి, అడవుల సంరక్షణతోనే మానవ మనుగడకు సుస్థిరత చేకూరుతుందని ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్ అన్నారు. శనివారం పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనం అంతరించడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడిందని, తద్వారా వర్షాలు లేక తాగు, సాగు నీటికి ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. వాతావరణ అనుకూలత చేకూరాలంటే ప్రతి ఒక్కరు తప్పకుండా మొక్కలను నాటాలని, నాటిని ప్రతి మొక్క పెరిగే విధంగా బాధ్యత వహించాలని సూచించారు. హరితహారంలో భాగంగా బస్టాండ్ అవరణలోని ఖాళీ స్థలంలో తాండూర్ డీఎం రాజశేఖర్, కంట్రోలర్ ఆనందం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు వెంకటయ్య (మాఫి), నవాజ్ పాల్గొన్నారు.

దౌల్తాబాద్‌లో..
దౌల్తాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 33 శాతం అడవుల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని జడ్పీటీసీ కోట్ల మహిపాల్ అన్నారు. శనివారం దౌల్తాబాద్ మండలంలోని రాళ్లగుట్ట, నంద్యాతండాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలాన్నారు. దౌల్తాబాద్ మండలంలో విరివిగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు వెళ్తున్నామన్నారు. మండలంలోని ఆలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు, ఇంటి ఆవరణల్లో, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, ఆయ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ కేశవరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో,అంగన్‌వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...