నిధులున్నా పనులు సున్నా..!


Sun,July 21, 2019 11:24 PM

కులకచర్ల : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్లు అద్దంలాగా మేరుస్తుంటే కులకచర్ల మండలంలో మాత్రం ప్రయాణీకులకు వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. కులకచర్ల నుంచి బండవెల్కిచర్ల మీదు గా దాదాపూర్ రోడ్డు వరకు 10కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా గుంతలతో దర్శనిమిస్తోంది. ఈ రోడ్డు పూర్తిగా గుంతల మయం కావడంతో వాహనాదారులు ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. ఈ రోడ్డు గుండా పాంబండ కామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఉత్సవాలకు కర్ణాటక నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇంతటి ప్రాదన్యాత ఉన్న రోడ్డు శిథిలమవ డంతో చుట్టుపక్క గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. కులకచర్ల నుంచి బండవెల్కిచర్ల గ్రామంతో పాటు మండల పరిధిలోని ఎర్రగోవింద్‌తండా, రాంనగర్, దాదాపూర్, సాల్వీడ్, గోప్యనాయక్‌తండాకు ఇదే రోడ్డుగుండా వెళ్లాల్సి ఉంటుంది. రోడ్డు పూర్తిగా గుంతల మయం కావడంతో అత్యవసర సమయల్లో ప్రయాణం చేయలంటే చాలా కష్టంగా ఉందని ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారని గ్రామాల ప్రజలు తెలిపారు. శిథిలావస్థలో ఉన్న రోడ్డుకు మరమ్మతులు చేయించి ప్రయాణీకులు, వాహనదారుల ఇబ్బందులు తొలగించాలని గ్రామానికి వచ్చిన ఎంపీడీవో, కలెక్టర్లకు పలుమార్లు వినతిపత్రం అందించినట్లు గ్రామస్తులు తెలిపారు.

మూడు రోడ్లు శిథిలావస్థలోనే..
కులకచర్ల మండ పరిధిలోని కులకచర్ల-బండవెల్కిచర్ల, కులకచర్ల-కొత్తపల్లి, ఇప్పాయిపల్లి- పుట్టపహడ్ రోడ్లు పూర్తి గా పాడవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నా రు. ప్రయాణీకుల ఇబ్బందులు తొలగించేందుకు గత సంవత్సరం 14కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం మంజూ రు చేసింది. కానీ అధికారుల, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వలన రోడ్లు ఇప్పటి వరకు ప్రారంభించలేక పోయారు.

నిధులు మంజూరైనా పనులు ప్రారంభించని అధికారులు
కులకచర్ల మండల పరిధిలోని 3రోడ్లు, దోమ మండల పరిధిలో 1రోడ్డుకు 14కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. కులకచర్ల నుంచి దాదాపూర్‌కు 8కి.మీ. మో త్కూర్ నుంచి ఐనాపూర్‌కు 5కి.మీ, ఇప్పాయిపల్లి నుంచి కుస్మసముద్రం మీదుగా పుట్టపహాడ్‌కు 11కి.మీ, కులకచర్ల నుంచి కొత్తపల్లి కులకచర్ల మండలం సరిహద్దు వరకు 17 కి.మీ బీటీరోడ్డు వేసేందుకు 14కోట్లు మంజూరయ్యాయి. అందులో కులకచర్ల నుంచి కొత్తపల్లి వరకు డబల్‌రోడ్డు, మిగితా మూడు రోడ్లు సింగిల్ రోడ్లకు నిధులు కేటాయించారు. నిధులు మంజూరై సంవత్సరం అవుతున్న అధికారు ల నిర్లక్ష్యంతో పనులు మూలన పడ్డాయి.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...