మహంకాళి బోనం.. లష్కర్ సంబురం


Sun,July 21, 2019 11:24 PM

లష్కర్ బోనమెత్తింది.. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయం భక్తజనసంద్రంగా మారింది. మహంకాళి బోనాల జాతరను ఆదివారం వైభవంగా జరుపుకున్నారు. సీఎం కేసీఆర్ అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్ర్తాలు సమర్పించి పూజలు చేశారు. మాజీ ఎంపీ కవిత బోనం సమర్పించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్, హైకోర్టు న్యాయమూర్తి అమర్‌నాథ్‌గౌడ్, ఎంపీలు రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, జన సమితి పార్టీ అధ్యక్షులు కోదండరాం ,ఎర్రోళ్ల శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు. కమిషనర్ అంజనీకుమార్ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...