అవినీతిపై కలెక్టర్ విచారణ చేపట్టాలి


Fri,July 19, 2019 11:48 PM

వికారాబాద్ టౌన్ : మున్సిపాలిటీని ఐదేండ్లుగా పాలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ అవినీతికి వత్తాసు పలికారు, కానీ అభివృద్ధి కాదని నెలకోసారి నిర్వహించాల్సిన సమావేశాన్ని మూడునెలలకోసారి నిర్వహించి సభను తప్పుదోవ పట్టించడం తప్ప తను చేసిందేమీ లేదని మాజీ కౌన్సిలర్లు లక్ష్మీకాంత్‌రెడ్డి, నర్సింగ్‌రావు, నర్సింహు లు, రామ్‌విలాస్ రాఠి, సురేశ్ ముక్తకంఠంతో ఆరోపించా రు. శుక్రవారం వికారాబాద్ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది నాయకులు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి మాజీ కౌన్సిలర్లు కొంత మంది రబ్బరు స్టాంపు వారని, ఎ మ్మెల్యే ఆనంద్ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎలా ంటి తోడ్పాటు అందించలేదని విమర్శించారు. ఎమ్మెల్యే పట్టణంలో 28 వార్డుల్లో తిరుగుతూ తక్ష ణం అవసరమైన అభివృద్ధి పనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయ డం జరుగుతుందన్నారు. ఐదేండ్లలో ఒక్కరోజు కూడా ఒక కౌన్సిలర్‌తో కలిసి కాలనీలో తిరుగని మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ ఎమ్మెల్యేను విమర్శించడం తగదన్నారు. ఐదేండ్లుగా పా లించిన మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ కౌన్సిల్‌ను మొత్తం తప్పుదోవ పట్టించారన్నారు. ఐదేండ్ల నుంచి కో ఆప్షన్ మెంబర్‌ను ఎన్నుకొని దుస్థితికి తీసుకొచ్చిన పరిస్థితి సత్యనారాయణకే దక్కుతుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

కౌన్సిలర్లు ఎమ్మెల్యే తొత్తులుగా తయారయ్యారని, రబ్బ ర్ స్టాంపులుగా ఉన్నారని అనడం చాలా బాధాకరమన్నా రు. 40 ఏండ్ల రాజకీయాల్లో ఉంటూ నేను సీనియర్ నని చెప్పుకునే నాయకులు అవినీతికి పెద్దపీట వేశారన్నారు. మున్సిపాలిటీలో 40 అంశాలను కౌన్సిల్ ముందుకు రా కుండానే ఆమోదం పుస్తకంలో రాయడం, తమవంతపాడేవారికి పనులు అప్పజెప్పడం, చేపట్టడం, శివారెడ్డిపేట చెరువుల నీరు లేకుండానే నీటిశుద్ధి చేయడానికి బ్లీచింగ్ పౌం డర్, ఇతర వాటికి లక్షలకు లక్షల బిల్లులు పెట్టి నిధులను దుర్వినియోగం చేశారని వీటన్నింటిపై కలెక్టర్ వెంటనే విచారణ చేపట్టేలా చూస్తామని మాజీ కౌన్సిలర్లు తెలిపారు. ము న్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ చేస్తున్న అవినీతి, అ క్రమాలను చూసి భరించలేక టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరడం జరిగిందన్నారు. చివరి సమావేశంలో ప్రవేశపెట్టిన ఎజెండా తప్పుల తడుకగా ఉందని అందులోని ఎజెండాను తిరస్కరించడం జరిగిదందని వారు తెలిపారు. మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై కలెక్టర్‌తో విచారణ చేయించి తిన్నదంతా కక్కిస్తామన్నారు. ఎమ్మెల్యే వచ్చిన కొన్ని రోజుల్లోనే మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని, ప్రతి వా ర్డు తిరిగి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునే నాయకుడికి సహకరించలేదనడం సరికాదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్‌లో 34 కౌన్సిలర్లకు 34 గెలిచి కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తామన్నారు. కార్యక్రమం లో పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు అనంతరె డ్డి, విజయ్‌కుమార్, నవీన్, చందర్‌నాయక్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...