టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం


Fri,July 19, 2019 11:48 PM

- పార్టీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి
ధారూరు : ప్రభుత్వం ప్రవేశపట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరవేయాలని టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కె.వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని రుద్రారం, గడ్డమీది గంగా రం, నర్సపూర్, కోండాపూర్ కలాన్, ధర్మాపూర్, కుక్కింద తదితర గ్రామా ల్లో పార్టీ గ్రామ కమిటీలను ఏర్పాటు వేశారు. ఆయా గ్రామాల్లోనూ సమావేశాలను ఏర్పాటు చేసి గ్రామ కమిటీ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ రుద్రారం గ్రామ కమిటీ అ ధ్యక్షుడిగా లచ్చప్ప, గడ్డమీది గంగారం గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కుర్వ బందయ్య, నర్సపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా బి.రాజు, కోండాపూర్ కలాన్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పి.లక్ష్మయ్య, కు క్కింద గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గౌరప్ప, ధర్మాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఆశప్పలను నా యకులు, కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. గ్రామ కమిటీలో మొత్తం 11 మంది సభ్యులు ఉంటారని, ప్రతి రెండేండ్లకు ఒ క్కసారి కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందన్నా రు. గ్రామ కమిటీ అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరించి ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా చూడాలన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, పార్టీ మండల ప్రధా న కార్యదర్శి అంజయ్య, జిల్లా నాయకుడు వడ్ల నందు, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు కె.వీరేశం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజునాయక్, ఎంపీటీసీ పి.బసప్ప, ధారూరు ఉపసర్పం చ్ ఎల్. రాజేశ్వర్, నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామస్తులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...