జిల్లాలోని రెండు మున్సిపాలిటీల ఎన్నికలపై స్టే


Fri,July 19, 2019 11:47 PM

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిలిపివేయాలని స్టే విధించింది. జిల్లాలోని వికారాబాద్, పరిగి మున్సిపాలిటీలకు ఎన్నికలపై స్టే విధిస్తూ శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వికారాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ వార్డుల విభజన సహేతుకంగా లేదని, వార్డుల విభజన తప్పుల తడకగా ఉందని, అధికారులు ఇష్టానుసారంగా వార్డుల విభజన చేశారంటూ వికారాబాద్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నేతలు సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు హైకోర్టులో రెండు రోజుల క్రితం పిటీషన్ దాఖలు చేయగా, శుక్రవారం పిటీషన్‌ను స్వీకరించిన కోర్టు ఎన్నికలను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అదేవిధంగా వార్డుల విభజన సరిగ్గాలేదని పరిగి పట్టణానికి చెందిన ముజమిల్ అనే వ్యక్తి పిటీషన్ దాఖలు చేయగా హైకోర్టు ఎన్నికలను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...