రైల్వే వసతులను కల్పించాలి


Fri,July 19, 2019 11:47 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ: రైల్వే సమస్యలను పరిష్కరించి వికారాబాద్ జిల్లా ప్రజలకు న్యాయం చేయాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డా. గడ్డం రంజిత్‌రెడ్డి శుక్రవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి జిల్లాలో రైల్వే సౌకర్యాలు కల్పించి న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లింగంపల్లి నుంచి వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్‌ను పొడగించాలని, వికారాబాద్ నుంచి సికింద్రాబాద్ వరకు పుష్పుల్ రైలు సర్వీసులు అందించాలని, రైల్వే వంతెనల నిర్మాణం చేపట్టాలని కోరుతూ వినతిపత్రం అందించారు. అదేవిధంగా రామయ్యగూడ, గంగారంవద్ద ఉన్న రైల్వేపాసింగ్‌పై వంతెనలు నిర్మించాలని కోరారు. అనేక రైళ్లు వికారాబాద్, మర్పల్లి తదితర రైల్వేస్టేషన్ల వద్ద ట్రేన్లను ఆపాలని కోరారు. రైల్వేస్టేషన్ల వద్ద ఫుట్‌ఓవర్ బ్రిడ్జీల నిర్మాణాలు చేపట్టాలన్నారు. రైల్వేసమస్యలపై 16 సమస్యలను వివరిస్తూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు వినతిపత్రం అందించారు. దీనిపై స్పందించిన మంత్రి సానుకూలంగా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలియజేసినట్లు ఎంపీ తెలిపారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...