ఇష్టపడి ఉద్యోగం చేయాలి


Fri,July 19, 2019 11:47 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : ఇష్టంతో కష్టపడి ఉద్యోగం నిర్వహిస్తే దానికి పూర్తి న్యాయం చేసినవారమవుతామని జాయింట్ కలెక్టర్ అరుణకుమారి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఐ లవ్ మైజాబ్ జిల్లాస్థాయి వ్యాస రచన పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతియ స్థానం సాధించిన ఉపాధ్యాయుల అభినందన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ అరుణకుమారి మాట్లాడారు. ప్రతి విద్యార్థికి మార్గదర్శకులు గురువులని వారి సహకారంతో ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని గురువులు చూపిన మార్గంలో పయనించి విజయం సాధించి ప్రస్తుతం ఉన్నత ఉద్యోగాలు సాధించామని తెలియజేశారు. ఉపాధ్యాయ వృత్తి చాలగొప్పదని ఎంతో ప్రవిత్రమైనదని తెలిపారు. ఉపాధ్యాయులు కావడానికి బీఈడీ చదివి డిప్యూటీ తహసీల్దార్‌గా నియమితులయ్యానని జేసీ వివరించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యతోపాటు మంచి నడవడిక, సాంస్కృతి, సంప్రదాయాలు నేర్పి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ఎన్నికల్లో ఉపాధ్యాయుల సేవలు ఎంతో కీకలమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఆర్‌వో మోతీలాల్ మాట్లాడుతూ అవార్డులు సన్మార్గాలు ఉద్యోగ బాధ్యతలను మరింత పెంచుతాయని తెలియజేశారు. ఒక ఉద్యోగి తన వృత్తి ధర్మాన్ని బాధ్యతగా చక్కగా నిర్వహించినప్పుడు కలిగే సంతోషం చెప్పలేని విధంగా ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తి చాలగొప్పదని ప్రతి ఉపాధ్యాయుడు ఐలవ్ మైజాబ్ అని పనిచేయాలని సూచించారు. జిల్లా విద్యాధికారి రేణుకాదేవి మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా అన్నిరంగాల్లో వెనుకబడి ఉన్నా విద్యారంగంలో వెనుకబడకుండా పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన ఉపాధ్యాయులకు బహుమతులు అందించారు. బహుమతులు అందుకున్న ఉపాధ్యాయులు బుచ్చయ్య జడ్పీహెచ్‌ఎస్ తరిగోపుల, దివాకర్ శాస్త్రి, జంబాపూర్, మహేందర్‌సింగ్ గుళ్లకుంట, శిరీష చంగోల్, నర్సింహరాజు ధారూరు స్టేషన్, విఠలాగౌడ్ గొట్టిగకుర్దు, సుజాత చించల్‌పేట, అబీద్‌పాషా బషీరాబాద్, మహ్మద్‌షఫీ మర్పల్లి, ఫాతిమా కొడంగల్ బహుమతులు పొందిన వారిలో ఉన్నారు. సమావేశంలో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...