నేటి నుంచి ఆసరా పింఛన్ల ధ్రువపత్రాల పంపిణీ


Fri,July 19, 2019 11:47 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : జిల్లాలో నియోజక వర్గాల వారీగా అన్ని రకాల ఆసరా పెన్షన్లు పెంచిన పింఛన్లను ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా అందజేస్తామని కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మండలాల ఎంపీడీఓలతో కలెక్టర్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1,03,613 మంది వృద్ధ్దులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్ పొందుతున్నారని తెలిపారు. శనివారం నుంచి పెంచిన పెన్షన్ ధ్రువపత్రాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకు మండలాలవారీగా నియోజక వర్గాలకు నోడల్ ఆఫీసర్లను నియమించామన్నారు. పరిగి వికారాబాద్ ఆర్డీవో, తాండూరుకు తాండూరు ఆర్డీవో, వికారాబాద్‌కు డీఆర్‌వోను కొడంగల్‌కు జడ్పీ సీఈవోలను నోడల్ అధికారులుగా నియమించారు. జిల్లాలో పెన్షన్ ధారులకు ఇప్పటి వరకు నెలకు రూ. 11 కోట్లు చెల్లించడం జరిగేదన్నారు. పెంచిన ప్రకారం 22 కోట్లు చెల్లించనున్నట్లు తెలిపారు. తాండూరు నియోజక వర్గంలో 29,815 మంది, వికారాబాద్ నియోజక వర్గంలో 31, 485 మంది, పరిగి నియోజక వర్గంలో 23,600 మంది, కొడంగల్ నియోజక వర్గంలో 18,713 మంది పెన్షన్ దారులు ఉన్నారని తెలిపారు. పెన్షన్ మంజూరు పత్రాలను స్థానిక ప్రజా ప్రతినిధుల ద్వారా నిర్ణయించిన స్థలాల్లో పంపిణీ చేస్తారన్నారు. వికారాబాద్ నియోజక వర్గంలో అంబేద్కర్ భవనంలో ఉదయం 10 గంటల నుంచి మంజూరు పత్రాలు అందజేస్తారన్నారు. పరిగి నియోజక వర్గంలో కేఎస్‌ఆర్ ఫక్షన్‌హాల్లో, కొడంగల్ నియోజక వర్గంలో కేఎస్‌వీ ఫక్షన్‌హాల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. ఆయా నియోజక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, జడ్పీచైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. డీఆర్‌డీవో జాన్సన్, జడ్పీ సీఈవో పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...