తడి పొడి చెత్తను వేర్వేరుగా వేయాలి


Fri,July 19, 2019 02:24 AM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శికరాలకు ఎదుగాలని కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా తెలిపారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని కెజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనికి చేశారు. విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, నీటి సదుపాయం, మరుగుదొడ్ల సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ తడి చెత్త, పొడిచెత్తపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. చెత్త సేకరణకు మున్సిపాలిటి వారు ఇంటింటికీ వచ్చినప్పుడు తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా వేయాలని సూచించారు. విద్యార్థులు దీనిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. చెత్తను ఇష్టం వచ్చినట్లు రోడ్లపై వేయకూడదన్నారు. పరిసరాల పరిశుభ్రతకు కృషిచేయాలని తెలిపారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...