ప్రతి పథకాన్ని లబ్ధిదారుడికి చేరే విధంగా చూడాలి


Fri,July 19, 2019 02:23 AM

ధారూరు : ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ప్రతి పథకం లబ్ధిదారు డికి చేరే విధంగా చూడాలని టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కె.వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని అంతారం, మోమిన్‌కలాన్, మోమిన్‌ఖుర్దు, రాజాపూర్, పులిచింతలమడుగు తండా, గురుదోట్ల గ్రామాల్లో పార్టీ గ్రామ కమిటీలను వేశారు. ఆయా గ్రామాల్లో సమావేశాలను ఏర్పాటు చేసి గ్రామ కమిటీ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతారం గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఎల్.వేమారెడ్డి, మోమిన్‌కలాన్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కలీమోద్దీన్, మోమిన్‌ఖుర్దు గ్రామ కమిటీ అధ్యక్షుడిగా జి.రాజు, రాజాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కె.శ్రీశైలం, పులిచింతల మడుగు తండా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా వి.పాండు నాయక్, గురుదోట్ల గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఎం.రాములు లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. గ్రామ కమిటీలో మొత్తం 11 మంది సభ్యులు ఉంటారని, ప్రతి రెండేండ్లకు ఒక్కసారి కమిటీని ఎన్నుకోవ డం జరుగుతుందన్నారు. గ్రామ కమిటీ అధ్యక్షులు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యద ర్శి అంజయ్య, పీఎసీఎస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డి, జిల్లా నాయకుడు వడ్ల నందు, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు కె. వీరేశం, నాయకులు, సర్పంచ్‌లు, కో-ఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, ఆయా గ్రామస్తులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...