ఇలై ఆఫీసు పైసలుఇసైనె పనీ..


Thu,July 18, 2019 12:30 AM

-హైదరాబాద్‌లోనిఇంటి నుంచే ధరణి వెబ్‌సైట్ కార్యకలాపాలు
-కంప్యూటర్ ఆపరేటర్ పని చేసేదీ అక్కడే..!
-డబ్బులిచ్చినవారి సమస్యలకే పరిష్కారం?
-వారానికి ఒక్కసారేకార్యాలయానికి..
-ఎమ్మెల్యే ఆనంద్ పరిశీలనలో వెల్లడైన మోమిన్‌పేట తహసీల్దార్ నిర్వాకం
-డిప్యూటీ తహసీల్దార్‌పైనా ఆరోపణలు
-ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
-చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచన


అదో ఎమ్మార్వో ఆఫీసు అక్కడ తహసీల్దార్ ఉండరు. కానీ పైసలిస్తే మాత్రం ఏ పని అయినా ఇట్టే అయిపో తుంది. ఏకంగా ఆ తహసీల్దార్ హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచే ధరణి వెబ్‌సైట్ ద్వారా కార్యకలాపాలు నడిపిస్తున్నారు. ఈ నిర్వాకం బుధవారం ఎమ్మెల్యే ఆనంద్ మోమిన్ పేట తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించడంతో వెలుగుచూసింది. దీంతో సదరు ఎమ్మెల్యే తహసీల్దార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సూచించారు.-వికారాబాద్ టౌన్

ధారూరు : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్రకృతిని కాపాడాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం ధారూరు మండల కేంద్రంలోని అటవీశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రత్యేక నిధులతో ఏర్పాటు చేసిన శృతి వనంను వికారాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణకుమారి, జిల్లా అటవీశాఖ అధికారి వేణుమాధవ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం కోట్‌పల్లి ప్రాజెక్టు ప్రాంతంలోను ఔట్ పోస్టులను ప్రారంభించారు. మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ కలెక్టర్ ప్రత్యేక నిధులతో ఏర్పాటు చేసిన వనాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యక్తుల జ్ఞాపకార్థం మొక్కలు నాటుకొనే అవకాశాన్ని అటవీశాఖ కల్పించిందని, పుట్టిన రోజులైన, మరణించిన రోజులైన గుర్తింపుగా మొక్కలు నాటితే వాటిని సంరక్షించే బాధ్యత అటవీశాఖ ఆధికారులు తీసుకుంటారని తెలిపారు. ప్రతి మొక్క పెంపకానికి అటవీశాఖ అధికారులకు రూ.5 వేలు చెల్లించాలన్నారు. త్వరలో నిర్వహించే హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయలన్నారు. మొక్కలు పెంచడం వల్ల వర్షాలు బాగా కురిసే అవకాశం ఉందన్నారు.

శృతి వనం వికారాబాద్ తాండూరు మధ్య రోడ్డు మార్గంలో ఉందని ప్రకృతి వనంలో కుర్చోని భోజనాలు చేసి ప్రశాంత వాతావరణంలో సేదతీసుకుంటారన్నారు. అనంతరం వికారాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణకుమారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్రకృతిని కాపాడాలన్నారు. వృక్షాలను మనం రక్షిస్తే మనన్ని వృక్షాలు రక్షిస్తాయన్నారు. శృతి వనంను ప్లాస్టిక్ రహితంగా ఉంచాలన్నారు. మొక్కలను నాటేటప్పుడు ప్లాస్టిక్ బ్యాగులు లేకుండా చూడాలన్నారు. మొక్కలు నాటి వాటిని కాపాడే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రజలందరూ మొక్కలు నాటి వాటిని కాపాడాలన్నారు. నాన్న, అన్నల జ్ఞాపకార్థం నేరెడు, మామిడి మొక్కను నాటారు. అనంతరం జిల్లా అటవీ శాఖ అధికారి వేణుమాధవ్ మాట్లాడుతూ శృతి వనం ధారూరు మండల కేంద్రంలో రోడ్డుకు దగ్గరలో ఏర్పాటు చేశామన్నారు. శృతి వనంకు 2.20ఎకరాలు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ధారూరు ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ సుజాత, పీఎసీఎస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డి, వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, తహసీల్దార్ రాధాబాయి, ధారూరు ఎంపీడీవో మున్నయ్య, ఎయంసీ చైర్మన్ కావలి అంజయ్య, ధారూరు అటవీశాఖ రేంజీ అధికారి వెంకటయ్యగౌడ్, అటవీశాఖ సిబ్బంది మోహీజ్‌ఖురేసీ,హఫీజ్, యాత్రగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు వందలో ఒక్కరుగా ఉండాలి
విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు మందలో ఒకరిగాకాకుండా వందలో ఒకరుగా ఉండాలని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని ధారూరు స్టేషన్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు బూట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ధారూరు ఎంపీపీ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, పీఎసీఎస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డి, ఎఎంసీ చైర్మన్ కావలి అంజయ్య, ఉపాధ్యాయులు మల్లికార్జున్, సర్పంచ్ రేణుక తదితరులు పాల్గొన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...