మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలి


Thu,July 18, 2019 12:19 AM

బంట్వారం : త్వరలో వర్షాలు కురువగానే హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు అధికారులంతా సిద్ధంగా ఉండాలని వోఎస్‌డీ రవీ ందర్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో హరిత హారంపై వివిధ శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సకాలంలో వర్షాలు రాలేక ఆలస్యమైందని, ఇప్పటికే కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందని పే ర్కొన్నారు. వర్షాలు వచ్చిన వెంటనే మొక్కలు నా టేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని సంబంధిత గ్రామ కార్యదర్శులు, సర్పంచ్‌లు, టీ ఏ, ఎఫ్‌ఎలకు సూచించారు. మొక్కల నాటేముం దు నిబ్బందలను తప్పకుండా పాటించాలన్నారు. ఏపీవో సుధాకర్ మాట్లాడుతూ హార్టికల్చర్ శాఖ లో వంద శాతం సబ్సిడీ ఉంటుందని, అందుకు రైతులకు అన్ని వివరాలు తెలియజేయాలన్నారు. ముందుకు వచ్చిన రైతులకు సొంత భూమి ఉండి నీటిపారుదల ఉండాలన్నారు. ఎకరానికి 70 మొ క్కలను నాటాల్సి ఉంటుందన్నారు.

2 వేల ఎకరాల్లో ప్లాంటేషన్...
హరితహారంలో భాగంగా రెండు వేల ఎకరా ల్లో ప్లాంటేషన్ చేయడం జరుగుతుందని అటవీ శాఖ తాండూరు రేంజీ ఎఫ్‌ఆర్‌వో శామ్‌సుందర్ రావు పేర్కొన్నారు. కల్కోడ బీట్ పరిధిలో 10 వేల వివిధ రకాల మొక్కలు, అదేవిధంగా తట్టేపల్లి బీట్ పరిధిలో 5 వేల మొక్కలను నాటనున్నామన్నారు. అటవీ ప్రాంతంలో ఏవైనా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న, కలప అక్రమ రవాణా అ వుతున్నట్లు సర్పంచ్‌లు, గ్రామస్తుల దృష్టికి వస్తే వెంటనే తమకు తెలియజేయాలన్నారు. బస్వపూ ర్ అడవి ప్రాంతంలో విలువైన టేకు చెట్లను అక్రమంగా సరఫరా చేస్తున్న అధికారులు చూసి, చూ డనట్లు ఉంటున్నారని సర్పంచ్‌లు చెప్పారు. దీనికి తమ రేంజీ పరిధిలో 25 మంది సిబ్బంది ఉండాల్సిన చోట కేవలం 5 మంది మాత్రమే ఉన్నారని, దీంతో కొంత జాప్యమైందని ఎఫ్‌ఆర్‌వో సమర్థించుకున్నారు.

ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో డెమో ప్లాంటేషన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుశీల్‌కుమార్, తహసీల్దార్ లలిత, వివిధ శాఖల అధికారులు, గ్రామాల కార్యదర్శు లు, ఎఫ్‌ఎలు, టీఏలు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...