ప్రమాదకరమైన విద్యుత్ స్తంభం తొలిగింపు


Thu,July 18, 2019 12:19 AM

తాండూరు రూరల్: ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని బుధవారం తొలిగించారు. తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలోని వార్డు నంబరు1లో విద్యుత్ స్తంభానికి కింది భాగంలో పగుళ్లు ఏర్పడ్డాయి. గాలి వీచినప్పుడల్లా స్తంభం ఊగుతూ ఉండేది. ఎప్పుడు విరిగి పడిపోతుందోనని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తుండేవారు. గ్రామ సర్పంచ్ రాజప్ప ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని క్రేన్ సహాయంతో తొలిగించి, కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేయించారు. కాలనీ వాసులు అందుకు హర్షం వ్యక్తం చేశారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...