ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలి


Thu,July 18, 2019 12:18 AM

మండల పరిధిలోని పాషాపూర్, అడికిచెర్ల గ్రామాల్లో నీటి పొదుపు, మరుగు దొడ్ల నిర్మాణంపై ఆయా గ్రామాల ప్రజలకు ఎంపీడీవో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి నీటిని పొదుపు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటిని ఎక్కువగా వృథా చేయడం జరుగుతుందని, నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. అదే విధంగా గ్రామంలో ప్రతి ఒక్కరూ ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని అందుకు ప్రభుత్వం రూ.

12వేల ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తుందని తెలిపారు. గ్రామ సర్పంచ్ బి.జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామానికి మొత్తం 170 మరుగుదొడ్లు మంజూరు కాగా అందులో 50 పూర్తవగా, 120 మరుగుదొడ్ల నిర్మాణాలు వేగవంతంగా కొనసాగుతుందని, ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించుకోని గ్రామాన్ని 100% మల విసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి సహకరించాలని, అలాగే నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోని,భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ఫక్రు, ఎంపీటీసీ ధన్‌సింగ్, గ్రామస్తులు, లబ్ధిదారులు,తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...