మహిళా, బాలికల


Thu,July 18, 2019 12:17 AM

-పాశ్చాత్య సంస్కృతితో జీవితాన్ని నాశనం చేసుకోవద్దు
-సోషల్ మీడియాతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి
-అపరిచిత వ్యక్తులతో చాటింగ్, మాట్లాడడం చేయకూడదు
-షీ టీం అవగాహన సదస్సులో ఎస్పీ నారాయణ
తాండూరు, నమస్తే తెలంగాణ : మహిళా, బాలికల రక్షణ కు షీ టీం అండగా ఉంటుందని ఎస్పీ నారాయణ అన్నా రు. బుధవారం తాండూరు పట్టణంలోని తులసీగార్డెన్‌లో తాండూరులోని ఇంటర్ మీడియట్ కళాశాల విద్యార్థులకు షీ టీంపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ నారాయణ, అడిషనల్ ఎస్పీ భాస్కర్ మాట్లాడుతూ బాలికలను ఎవరైనా భ యాందోళనలకు గురి చేసిన, వేధించిన, ఇబ్బందికరంగా మాట్లాడిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లా వ్యాప్తం గా ఆకతాయిలకు బుద్ధి చెప్పేందుకు నిఘా ఏర్పాటు చేశామన్నారు. అమ్మాయిలను వేధింపులకు గురి చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు ముఖ్యంగా సోషల్ మీడియాతో చా లా జాగ్రత్తగా వ్యవహరించాలని వారు సూచించారు. విద్యార్థి దశలో ఫోన్, ఇంటర్ నెట్‌లకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చేయడం, మాట్లాడడం చేయకూడదన్నారు. ఆకతాయిలు వెంటపడి వేధిస్తున్న, అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేసిన వెంటనే షీ టీం దృష్టికి తీసుకురావాలని వారు చెప్పారు.

క్రమ శిక్షణతో ఉంటూ తల్లిదండ్రుల ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమిస్తూ చదువాలన్నారు. పాశ్చాత్య సంస్కృతి, వెండి తెరపై ఇబ్బడి ముబ్బడి గా వస్తున్న అంతు లేని ప్రేమకతాచిత్రాలను వీక్షించి అదే జీవితమనుకొని బాలికలు, మహిళలు చెడుమార్గంలో ప యనించరాదన్నారు. పాఠశాల, కళాశాలల స్థాయి నుంచే ఎదుటి వ్యక్తి ఆకర్షనకు గురై యువత ప్రేమ మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. విద్యార్థులు పాఠశాల, కళాశాలల్లోకి ఫోన్‌లను తీసుకురాకుండా నిర్వాహకు లు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ నియమాలు కూడా విధిగా పాటించాలని గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. అనంతరం కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సీఐలు రవికుమార్, ఉపేందర్, షీ టీం ఇన్‌చార్జి చంద్రశేఖర్, పోలీసు సిబ్బంది, జూనియర్ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...