మున్సిపల్ ఓటర్లు 1,38,009


Wed,July 17, 2019 12:09 AM

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మున్సిపల్ ఎన్నికలకు కీలకమైన ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో మొత్తం 1,38,009 మంది ఓటర్లతో ఓటరు తుది జాబితాను ప్రకటించారు. అయితే అత్యధికంగా ఓటర్లు తాండూరు మున్సిపాలిటీలో ఉండగా, అత్యల్పంగా కొడంగల్ మున్సిపాలిటీలో ఉన్నారు. అదేవిధంగా జిల్లాలోని మున్సిపాలిటీ ఓటర్లలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. అంతేకాకుండా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోనూ బీసీ ఓటర్లే అధికంగా ఉన్నారు. మరోవైపు ఆగస్టు మొదటి వారంలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చకాచకా చేస్తున్నారు. అయితే ఇప్పటికే పోలింగ్ కేంద్రాల జాబితాను సిద్ధం చేసిన అధికారులు నేడు పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశమై కొత్త మున్సిపల్ చట్టానికి ఆమోదం తెలపడంతో పాటు రేపు, ఎల్లుండి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి కొత్త పురపాలక చట్టాన్ని ఆమోదించనున్నారు. అదేవిధంగా ఈనెల 20, 21 తేదీల్లో రిజర్వేషన్లను ప్రకటించి, ఈనెల 22వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది.

మొత్తం ఓటర్లు 1,38,009 మంది
జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో మొత్తం 1,38,009 మంది ఓటర్లున్నారు. అయితే మొత్తం ఓటర్లతో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. పురుషులు 68,842, మహిళలు 69,167 మంది ఓటర్లున్నారు. జిల్లాలోని తాండూరు మున్సిపాలిటీలో అత్యధికంగా 59,858 మంది, అత్యల్పంగా కొడంగల్ మున్సిపాలిటీలో 10,049 మంది ఓటర్లున్నారు. అదేవిధంగా వికారాబాద్ మున్సిపాలిటీలో 50,963 మంది ఓటర్లుండగా, పరిగి మున్సిపాలిటీలో 17,139 మంది ఓటర్లున్నారు. అదేవిధంగా నాలుగు మున్సిపాలిటీల్లో బీసీ ఓటర్లే అధికంగా ఉన్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం బీసీ ఓటర్లు 93,648 మంది ఉండగా, ఎస్సీ ఓటర్లు 15,709 మంది, ఎస్టీ ఓటర్లు 4220 మంది, ఇతరులు 24,405 మంది ఓటర్లున్నారు.

కాగా జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలోని మొత్తం ఓటర్లకు సంబంధించి.., వికారాబాద్ మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లు 50,963 మంది ఉండగా వీరిలో పురుషులు 25,476, మహిళలు 25,487 మంది, అదేవిధంగా ఎస్సీ ఓటర్లు మొత్తం 9,221 మంది ఉండగా వీరిలో పురుషులు 4,368, మహిళలు 4,853 మంది, ఎస్టీ ఓటర్లు మొత్తం 2,720 మంది ఉండగా వీరిలో పురుషులు 1,385, మహిళలు 1,335 మంది, అదేవిధంగా బీసీ ఓటర్లకు సంబంధించి మొత్తం 31,962 మంది ఓటర్లుండగా వీరిలో పురుషులు 15,071, మహిళలు 15,891 మంది, ఇతర కులాలకు చెందిన వారు మొత్తం 7,019 మంది ఓటర్లుండగా వీరిలో పురుషులు 3,652, మహిళలు 3,408 మంది ఉన్నారు. అదేవిధంగా తాండూ రు మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లు 59,858 మంది ఉండగా వీరిలో పురుషులు 29,523, మహిళలు 30,335 మంది, అదేవిధంగా ఎస్సీ ఓటర్లు మొత్తం 3,571 మంది ఉండగా వీరిలో పురుషులు 1,679, మహిళలు 1,891 మంది, ఎస్టీ ఓటర్లు మొత్తం 633 మంది ఉండగా వీరిలో పురుషులు 320, మహిళలు 312 మంది, అదేవిధంగా బీసీ ఓటర్లకు సంబంధించి మొత్తం 41,399 మంది ఓటర్లుండగా వీరిలో పురుషులు 20,432, మహిళలు 20,945 మంది, ఇతర కులాలకు చెందిన వారు మొత్తం 14,269 మంది ఓటర్లుండగా వీరిలో పురుషులు 7092, మహిళలు 7,187 మంది ఉన్నారు.

అదేవిధంగా కొడంగల్ మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లు 10,049 మంది ఉండగా వీరిలో పురుషులు 4,999, మహిళలు 5,050 మంది, అదేవిధంగా ఎస్సీ ఓటర్లు మొత్తం 1,174 మంది ఉండగా వీరిలో పురుషులు 565, మహిళలు 609 మంది, ఎస్టీ ఓటర్లు మొత్తం 284 మంది ఉండగా వీరిలో పురుషులు 156, మహిళలు 128 మంది, అదేవిధంగా బీసీ ఓటర్లకు సంబంధించి మొత్తం 7,571 మంది ఉండగా వీరిలో పురుషులు 3,757, మహిళలు 3,814 మంది, ఇతర కులాలకు చెందిన వారు మొత్తం 1,020 మంది ఓటర్లుండగా వీరిలో పురుషులు 521, మహిళలు 499 మంది ఓటర్లున్నారు. పరిగి మున్సిపాలిటీలో మొత్తం 17,139 మంది ఓటర్లుండగా వీరిలో పురుషులు 8,844, మహిళలు 8,295 మం ది ఉన్నారు. బీసీ ఓటర్లు మొత్తం 12,716 మంది ఉండగా వీరిలో పురుషులు 6563, మహిళలు 6153 మంది, ఎస్సీ ఓటర్లు మొత్తం 1743 మంది ఉండగా వీరిలో పురుషులు 823, మహిళలు 920, ఎస్టీ ఓటర్లు మొత్తం 583 మంది ఉండగా వీరిలో పురుషులు 306, మహిళలు 277 మంది, ఇతరులు మొత్తం 2,097 మంది ఉండగా వీరిలో పురుషులు 1,152, మహిళలు 945 మంది ఓటర్లున్నారు.

మహిళా ఓటర్లే ఎక్కువ..
జిల్లాలోని మున్సిపల్ ఓటర్లలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఒక్క పరిగి మున్సిపాలిటీ మినహాయిస్తే మిగతా అన్ని మున్సిపాలిటీల్లోనూ పురుషులకంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ గెలుపొటములు నిర్ణయించడంలో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లు 69,167 మంది ఉన్నారు. వికారాబాద్ మున్సిపాలిటీలో 25,487, తాండూరు మున్సిపాలిటీలో 30,335, కొడంగల్ మున్సిపాలిటీలో 5,050, పరిగి మున్సిపాలిటీలో 8,295 మంది మహిళా ఓటర్లున్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...