జడ్పీ ప్రతిష్ట పెంచేలా అధికారులు పనిచేయాలి


Wed,July 17, 2019 12:06 AM

వికారాబాద్ నమస్తే తెలంగాణ: జడ్పీ ప్రతిష్ట పెంచేలా అధికారులు సరైన విధంగా పని చేయాలని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్ జడ్పీ కార్యాలయంలో జడ్పీ సీఈవో శ్రీకాంత్‌రెడ్డితో పాటు కార్యాలయంలో వివిధ స్థాయిలో పనిచేస్తున్న అధికారులతో చైర్ పర్సన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారులు చక్కగా పనిచేసి కీర్తిప్రతిష్టలు సాధించేలా పనిచేయాలన్నారు. కార్యాలయంలో అవినీతిని సహించేదిలేదని హెచ్చరించారు. వికారాబాద్ కొత్త జిల్లాగా ఏర్పడినందున అభివృద్ధి చేయాల్సిన ఆవస్యకత ఉందన్నారు. మూడోసారి జడ్పీచైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టినందున అనుభవంతో వెనుకబడ్డ జిల్లాను అన్నివిధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. వివిధ పనుల నిమిత్తం జడ్పీకి వచ్చే ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు అధికారులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. జడ్పీ పనులకు సంబంధించిన పనుల ఫైల్‌లు సెక్షన్‌కు వచ్చినప్పుడు సకాలంలో పరిష్కరించాలన్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. మహిళా ఉద్యోగుల పట్ల గౌరవంగా నడుచుకోవాలని తెలిపారు. ఉద్యోగులకు ఏమైన ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, పీఏలు పాల్గొన్నారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉత్సవ వేడుకల్లో భాగంగా అనంతపద్మనాభ స్వామిని దర్శించుకున్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...