అంత్యక్రియల్లో తుపాకుల మోత


Wed,July 17, 2019 12:06 AM

బషీరాబాద్: ఓ వ్యక్తి అంత్యక్రియాల్లో తుపాకుల మోత మోగించడంతో సదురు వ్యక్తులపై కేసు నమోదు చేసి తుపాకులు స్వాధీనం చేసుకున్న సంఘటన మంగళవారం మండల పరిధిలోని నీళ్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో మంగళవారం మృతి చెందాడు. ఆయన అంత్యక్రియలకు గ్రామస్తులు, బంధువులు వచ్చారు. గ్రామ పెద్ద మనిషి చనిపోయాడని బంధువులు గౌరవ పూచికంగా ఉండాలని తుపాకులు కాల్చాలని నిర్ణయించారు. దీంతో పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రం సేడం తాలుకా బందెంపల్లి గ్రామం ఇందిరనగర్ తండాకు చెందిన సభావత్ లాలునాయక్, పాత్లపత్ గోబిర్యనాయక్, పాత్లావత్ లాల్యనాయక్‌లను రప్పించారు. వారు అక్కడి ప్రభుత్వ అనుమతితో ఉన్న మూడు ఎస్‌బీఎంఎల్-4 తుపాకులతో వచ్చారు. సదురు వ్యక్తి మృతికి గౌరవ సూచికంగా అంత్యక్రియల్లో గన్‌ఫౌడర్ నింపిన తుపాకులతో గాల్లోకి కాల్చారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని ఆయు ధాలను స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలియగానే గ్రామాన్ని తాండూరు రూరల్ సీఐ ఉపేందర్ సందర్శించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తుపాకుల వివరాలను అడిగి తెలుసుకున్నా రు. కర్ణాటక రాష్ట్రం అనుమతులు ఉన్న వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...