సేంద్రియ సాగు రైతులకు మార్కెటింగ్ కల్పించాలి


Wed,July 17, 2019 12:05 AM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : జిల్లాలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతుల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు స్టాల్స్ ఏర్పాటు చేసి మార్కెట్ సదుపాయం కల్పించాలని కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫెరెన్స్ హాల్లో వ్యవసాయ సాంకేంతిక యాజమాన్య సంస్థ ఆత్మ గవర్నింగ్ బోర్డు, ఆత్మ నిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయేషా మాట్లాడుతూ మొక్కజొన్నలో కత్తెర పురుగు, పత్తిలో గులాబీరంగు పరుగును నివారించేందుకు అధికారులు ఎప్పటి కప్పుడు రైతులకు సూచనలు, సలహాలు అందించాలన్నారు. అలాగే కొత్త టెక్నాలజీపై రైతులకు సైటిస్టుల ద్వారా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సేంద్రియ పద్ధతి ద్వారా చిరు ధాన్యాలను పండించేందుకు కృషి చేయాలన్నారు. ఏరువాక సీనియర్ సైంటిస్ట్ తెలిపినట్లుగా తక్కువ నీటితో వరిని ఆరుతడి పద్ధతిలో పండించేందుకు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. 2018-19 సంవత్సరంలో ఆత్మద్వారా జరిగిన కార్యక్రమాలపై సమీక్షించి రానున్న సంవత్సరంలో ప్రణాళికాబద్ధ్దంగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో 2019-20 ఆత్మవార్షిక ప్రణాళికను సమావేశంలో ఆమోదించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, ఎల్డీఎం సుమలత, సీనియర్ సైన్‌టిస్ట్ డాక్టర్ ప్రవీణ, మత్స్యశాఖ అధికారి దుర్గప్రసాద్, హార్టికల్చర్ అధికారి వైజయంతి, వ్యవసాయ శాఖ ఏడీ పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...