నేడు గురుపౌర్ణిమ ఉత్సవాలు


Tue,July 16, 2019 03:18 AM

వికారాబాద్ టౌన్ : సత్యసాయి సేవ సమితి వికారాబాద్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక సత్యసాయి జ్ఞాన కేంద్రంలో గురుపౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని సత్యసాయి సేవా సమితి కన్వీనర్ హారతి ధ్వారక్ నాథ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుపౌర్ణమి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం 5గంటలకు ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తణ, ఉదయం 8-45గంటలకు పథాకావిష్కరణ, 9గంటలకు పూజ కార్యక్రమం, సాయిగాణ వేధపఠనం, సాయి అష్టోత్తర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం 9గంటలకు భజన సంకీర్తణ, 10-20 మంగళహారతీ, తీర్తప్రసాద వితరణ, సాయంత్రం 5గంటలకు భక్తిపారవశ్య కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమానికి పుర ప్రముఖులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సేవాదల్ సభ్యలు పాల్గొని స్వామివారి ఆసిస్సులు పొందాలన్నారు.

ముస్తాబైన దేవాలయాలు
మర్పల్లి : మండల పరిధిలోని సిరిపురం గ్రామ సమీపంలో ఉన్న దత్తాత్రేయ స్వామి దేవాలయం, మర్పల్లి గ్రామ సమీపంలో ఉన్న షిర్డీసాయిబాబా దేవాలయాల్లో నేడు గురుపౌర్ణమిని పురస్కరించుకుని ఆయా దేవాలయాలను ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా సాయిబాబా దేవాలయ కమిటీ సభ్యుడు మల్లేషం మాట్లాడుతూ ఉదయం గ్రామంలో నుంచి స్వామివారి పల్లకిసేవ ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం దేవాలయంలో స్వామివారికి ఆభిషేకం ప్రత్యేక పూజలు, మంగళ హారతి, తీర్థప్రసాదం, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...