వారం రోజుల్లో రైతుబంధు


Tue,July 16, 2019 12:00 AM-జిల్లావ్యాప్తంగా 207057మంది
-అన్నదాతలు౧,137,814 మందికి అందిన రైతుబంధు
-ఇప్పటివరకు రూ.152 కోట్లు రైతుల ఖాతాల్లోకి..
-జిల్లాకు రూ.814 కోట్ల నిధులు విడుదల
-ట్రెజరీకి చేరిన 292 మంది రైతుల వివరాలు
-ఎకరాకు అందుతున్న రూ.176885 వేల ఆర్థిక సహాయం

రైతుబంధు ఆర్థిక సహాయం పంపిణీ దాదాపు పూర్తి కావొచ్చింది. మరో వారం రోజుల్లో జిల్లాలోని అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందనుంది. రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల క్రితమే రైతుబంధు పథకానికి నిధులు విడుదల చేసినప్పటికీ ట్రెజరీ కార్యాలయంలో బిల్లులు ఆలస్యంగా చేయడంతో పాటు సంబంధిత బిల్లులు ఆర్థిక శాఖ ఆమోదం పొందాల్సి ఉన్నందున రైతుబంధు కొంతమందికి ఆలస్యమవుతున్నట్లు జిల్లా వ్యవసాయాధికారులు తెలిపారు.ఇప్పటి వరకు జిల్లాలో ౧,౩౭,౮౧౫ మంది రైతులకు రైతుబంధు వారి ఖాతాల్లో జమైంది. మిగతా వారికి వారం రోజుల్లో జమకానుం-వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు ఆర్థిక సహాయం పంపిణీ పూర్తి కావొచ్చింది. మరో వారం, పది రోజుల్లో జిల్లాలోని అర్హులైన రైతులందరికీ రైతుబంధు పెట్టుబడి సాయం అందనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల క్రితమే రైతు బంధు పథకానికి నిధులను విడుదల చేసిన విషయం తెలిసిం దే. ఈ వానకాలం సీజన్‌కు రైతుల ఖాతాల్లో ౨౦రోజులుగా రైతుబంధు డబ్బులను జమ చేస్తున్నారు. రైతుబంధు పథకానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి ఎప్పటికప్పుడు ఖజనా శాఖకు అందిస్తున్నప్పటికీ, ఖజనా కార్యాలయంలో బిల్లులు ఆలస్యంగా చేయడంతో పాటు సంబంధిత బిల్లులను ఆర్థిక శాఖ ఆమోదం పొందాల్సి ఉన్నందునా రైతుబంధు పెట్టుబడి సహాయం కొంత ఆలస్యమవుతున్నట్లు జిల్లా వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ వారం, పది రోజుల్లో వానకాలం సీజన్‌కు సం బంధించిన రైతుబంధు డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. అదే విధంగా తొలుత ౧౦ఎకరాలలోపు భూమిగల రైతులకు రైతుబంధు డబ్బులను జమ చేసిన ప్రభుత్వం ప్రస్తుతం పది ఎకరాల కంటే ఎక్కువ భూములు కలిగిన రైతులకు రైతుబంధు సాయాన్ని జమ చేస్తుంది. అయితే రైతులను అప్పుల బారి నుంచి విముక్తి కలిగించడంతో పాటు పెట్టుబడి సాయమందించేందుకుగాను రైతుబంధు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గతేడాది వానకాలం నుంచి అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే జిల్లాకు ఈ సీజన్‌కుగాను రైతుబంధు పథకంలో భాగంగా రూ. ౨౯౨కోట్లను రాష్ట్ర ప్రభు త్వం విడుదల చేసింది. అయితే ఈ సీజన్ నుంచి ఎకరాకు రూ. ౫వేల పెట్టుబడి సహాయాన్ని అందిస్తుంది. అదే విధంగా గతేడాది వానకాలంలో ౧,౯౭,౯౫౯మంది రైతులకు రూ. ౨౨౦ కోట్ల ఆర్థిక సహాయం, రబీ సీజన్‌లో ౧,౭౬,౧౮౮మంది రైతులకు రూ. ౨౦౬కోట్లు రైతులకు ప్రభుత్వం అందజేసింది.

రూ. ౧౫౨కోట్ల రైతుబంధు జమ...
రైతులు అప్పుల బారిన పడకుండా రైతుబంధు సాయాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అందిస్తుంది. అయితే గతేడాది ఎకరాకు రూ. ౪వేల ఆర్థిక సాయాన్ని అందించిన ప్రభుత్వం సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువుల ధరలు పెరుగడంతో దానికి తగినట్లుగా ప్రభుత్వం పెట్టుబడి సహాయాన్ని ఎకరాకు రూ. ౫వేల ఆర్థిక సహాయాన్ని రైతులకు అందిస్తుంది. అయితే జిల్లా వ్యాప్తం గా ౨,౦౭,౦౪౭మంది రైతులు ఉండగా రూ. ౨౯౨కోట్ల నిధుల ను ప్రభుత్వం జిల్లాకు విడుదల చేసింది. అయితే జిల్లాలో ఇప్పటి వరకు రూ. ౧౫౨.౩౫కోట్ల పెట్టుబడి సహాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. జిల్లాలోని ౧,౩౭,౮౧౫మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రైతుబంధు డబ్బులు జమ అయ్యా యి. అయితే బొంరాస్‌పేట్ మండలంలో ౯౦౩౬మంది రైతుల కు రూ. ౯.౯౭కోట్లు, దౌల్తాబాద్ మండలంలో ౧౦,౫౬౪ మంది రైతులకు రూ.౧౨.౦౬కోట్లు, కొడంగల్ మండలంలో ౯౪౪౩ మంది రైతులకు రూ. ౧౧.౩౨కోట్లు, దోమ మండలంలో ౬౮౪౧ మంది రైతులకు రూ. ౬.౯౨కోట్లు, కుల్కచర్ల మండలంలో ౭౧౬౨మంది రైతులకు రూ.౭.౭౪ కోట్లు, పరిగి మండలంలో ౯౨౬౭మంది రైతులకు రూ.౧౦.౪౮ కోట్లు, పూడూర్ మండలం లో ౬౯౧౬మంది రైతులకు రూ.౭.౧౫కోట్లు, బషీరాబాద్ మండలంలో ౬౯౩౧మంది రైతులకు రూ.౮.౦౯కోట్లు, పెద్దేముల్ మం డలంలో ౬౬౬౬మంది రైతులకు రూ.౭.౮౬ కోట్లు, తాండూర్ మండలంలో ౬౪౫౮ మంది రైతులకు రూ. ౭.౫౩కోట్లు, యా లాల్ మండలంలో ౬౪౬౨మంది రైతులకురూ. ౭.౦౬ కోట్లు, బంట్వారం మండలంలో ౩౭౬౫ మంది రైతులకు రూ.౪.౬౩ కోట్లు, ధారూర్ మండలంలో ౮౦౭౯మంది రైతులకు రూ.౮.౫౨ కోట్లు, కోట్‌పల్లి మండలంలో ౫౧౭౫ మంది రైతులకు రూ. ౫.౭౬కోట్లు, మర్పల్లి మండలంలో ౯౪౩౦ మంది రైతులకు రూ.౧౧.౦౮ కోట్లు, మోమిన్‌పేట్ మండలంలో ౬౬౮౦ మంది రైతులకు రూ.౬.౭౭కోట్లు, నవాబుపేట్ మండలంలో ౧౦,౨౩౭ మంది రైతులకు రూ.౧౦.౭౩ కోట్లు, వికారాబాద్ మండలంలో ౮౭౦౩ మంది రైతులకు రూ.౮.౫౮ కోట్ల పెట్టుబడి ఆర్థిక సహాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అదేవిధంగా ఇప్పటి వరకు ౧,౮౩,౩౯౪ మంది రైతులకు సంబంధించి ఏఈవోల పరిశీలన ప్రక్రియ పూర్తికాగా ౧,౭౬,౮౮౫మంది రైతులకు సంబంధించిన బిల్లులు జిల్లా ఖజానా శాఖకు చేరింది. విడుతల వారీగా రైతుబంధు డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా లేకపోవడంతో పాటు రైతులకు సంబంధించి ఆధార్ వివరాలు లేకపోవడం తదితర కారణాలతో ౪౬౭మంది రైతులకు బ్యాంకు ఖాతాల్లో జమ చేసినప్పటికీ ఫెయిల్ అయినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
గతేడాది రూ. ౪౨౬కోట్ల రైతుబంధు జమ
రైతులకు పెట్టుబడి సాయమందించేందుకు ప్రభుత్వం అమ లు చేస్తున్న రైతుబంధు కార్యక్రమంలో భాగంగా గతేడాది వాన కాలం సీజన్‌లో పెట్టుబడి సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేయగా, యాసంగి సీజన్‌లో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నే రైతుబంధు డబ్బులను ఎకరానికి రూ. ౪వేల చొప్పు న జమ చేశారు. అయితే జిల్లాలో రైతుబంధు కార్యక్రమంలో భాగంగా గతేడాది వానకాలం, యాసంగి సీజన్‌లలో జిల్లాలోని రైతులకు రూ. ౪౨౬కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేసింది అయితే గతేడాది సీజన్‌కు ౨.౨౫లక్షల మంది రైతులకు రూ. ౨౪౪ కోట్లను ప్రభుత్వం జిల్లాకు విడుదల చేయగా, జిల్లాలో వివాదాస్పద భూములు ఉన్న దృష్ట్యా ౧,౯౭,౯౫౯ మంది రైతులకు రూ. ౨౨౦కోట్ల ఆర్థిక సాయమందించారు. అదేవిధంగా యాసంగి సీజన్‌కు సంబంధించి ౧,౯౯,౫౯౪మంది రైతులుండగా వివాదస్పద భూముల దృష్ట్యా ౧,౭౬,౧౮౮ మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. ౨౦౬ కోట్లను ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...