ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలి


Thu,June 27, 2019 12:20 AM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : జిల్లాలో దారిద్రరేఖకు దిగువన ఉన్న రైతులు గుర్తించి ఉద్యానవన పంటలు సాగు చేసేందుకు ప్రోత్సహించి వారి అభివృద్ధికి బాటలు వేయాలని కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాలులో ఉద్యాన వన పంటల పైలెట్ ప్రాజెక్టు పై ఉద్యానవన శాఖ అధికారులతో, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో దారిద్రరేఖకు దిగువన ఉన్న 124 మంది ఎస్సీ, బీసీ కులం రైతులను గుర్తించి ఉద్యానవన పంటలైన పందిర్ల సాగుకింద హైబ్రేడ్ కూరగాయలు సాంకేతిక సాగు కోరకు ప్రోత్సహించి వారిని అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు చర్య లు తీసుకోవాలన్నారు. దారిద్రరేఖకు దిగువన ఉండి కనీసం రెండున్నర ఎకరాల సాగు భూమి ఉండి విద్యుత్, నీటి సదుపాయం ఉన్న రైతులను గుర్తించాలన్నారు.

వారికి రూ.3.50లక్షల బ్యాంక్ రుణం అందించి శాశ్వత పందిరి కింది హైబ్రేడ్ కూరగాయలు పండించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ స్కీమ్‌లో సంవత్సరానికి రూ.1.50 లక్షలు ఆదాయం ఉన్నవారు అర్హులని, వితంతువు లు, వికలాంగులు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఈ పథకంలో ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఎస్సీ వితంతు మహిళలు వారి ఇంటి వెనుక ఖాళీ స్థలాల్లో నాటు కోళ్లఫారాలు ఏర్పాటు చేసుకునేందుకు ఒక్కొక్కరికి 200 నాటు కోడి పెట్టలు ఇచ్చి వాటి ద్వారా వచ్చే గుడ్లు, మాసంపై జీవనోపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీని ఆదేశించారు. వేప విత్తులతో తయారు చేసే నిమ్‌కే యూనిట్లను జిల్లాలో ఎస్సీ మహిళ సంఘాల ద్వారా ఏర్పాటు చేయుటకు ప్రతిపాధించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఏడీ బాబు మోజస్, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, ఎల్‌డీఎం సుమలత, జిల్లా పశువైద్యాధికారి వసంతకుమారి, కృషి విజ్ఞాన్ కేంద్ర సైంటిస్టులు విజయ్‌కుమార్, విద్యాదరి తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...