అక్రమ నిర్మాణాలపై పట్టింపేదీ..?


Thu,June 27, 2019 12:20 AM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : వికారాబాద్ పట్టణంలో రోజు రోజుకు అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నా మున్సిపల్ అధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులు యథేచ్ఛగా రోడ్లను ఆక్రమించేలా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. మున్సిపల్ అధికారులు లంచాలకు మరిగి అక్రమ నిర్మాణాలను చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులు ఏ మాత్రం భయం లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని పట్టణ వాసులు పేర్కొంటున్నారు. మొన్నటికి మొన్న రాజీవ్ గృహకల్పలో సమస్యలపై పర్యటించిన ఎమ్మెల్యే సైతం అక్రమ నిర్మాణాలు జరుగకుండా చూసి ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే ఆదేశించినా, అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. వికారాబాద్ పట్టణంలో రోడ్లకు ఇరువైపుల అక్రమంగా షెడ్లు ఏర్పాటు చేసినా తొలిగించడం లేదు. దీంతో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నా మున్సిపల్ సిబ్బందికి వారు ఇస్తున్న కాస్తో కూస్తో డబ్బులకు వారిని ఏమనలేక పోతున్నారు. అదే విధంగా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో కూడా ఎటు చూసిన అక్రమ కట్టడాలే దర్శణమిస్తాయి. అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఎమ్మెల్యే ఆదేశించిన అధికారులు ఇప్పటి వరకు చలనం లేదు. దీనిని అదునుగా చూసుకొని ఒకరిని చూసి ఒకరు అక్రమ కట్టడాలు కట్టడంతో రోడ్లపైకి నిర్మాణాలు వస్తున్నాయి. దీంతో మురుగు కాల్వల మరమ్మతులకు, రోడ్లపై తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. వెంటనే అక్రమ నిర్మాణాలను తొలిగించి సరైన సౌకర్యాలు కల్పించాలని కాలనీ వాసులు పేర్కొంటున్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...