కల్యాణలక్ష్మితో పేదల ఇండ్లల్లో కాంతులు


Wed,June 26, 2019 12:30 AM

వికారాబాద్ టౌన్ : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో నిరుపేదలకు ఎంతగానో సహాయం అందే విధంగా ఈ పథకాలను తీసుకొచ్చారని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని గంగారం, సాయిబాబ కాలనీ, బస్టాండ్ పరిసరాలను పరిశీలించి, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి ఇద్దరికీ, షాదీముబారక్ ముగ్గురికి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పేదల పెండ్లిళ్లకు ఆసరాగా నిలువాలని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తీసుకొచ్చి అమలు చేసి చెక్కులను అందించడం జరుగుతుందని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లతో పేదలు పెండ్లిళ్లు చేసేందుకు ఎంతగానో ధైర్యాన్ని ఇస్తుందన్నారు. పేదల పెండ్లిళ్లకు ప్రభుత్వం సహా యం అందించి వారిలో మనోధైర్యాన్ని నింపి కుటుంబ పెద్దగా నిలువడం జరుగుతుందన్నారు. లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కు లు అందించడంతో వారి కుటుంబాల్లో సం తో షం చూస్తున్నామన్నారు. అంతే కాకుండా స్థానిక సమస్యలను తెలుసుకొని అభివృద్ధిపై దృష్టి సారించేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. అనంతరం గంగారంలోని ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి విద్యార్థులతో కలిసి ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాలలో తాగునీటి సమస్య ఉందని ఉ పాధ్యాయురాలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కాలనీలో మురుగు నీటి కాలువల ను పరిశీలించి కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకొని నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు.

గంగారం నుంచి ధర్మ విద్యాలయం పాఠశాల సమీపం వరకు ఉన్న రోడ్డు వివరాలను అందించాలని ఎమ్మెల్యే ము న్సిపల్ అధికారులను ఆదేశించారు. మురుగు కాల్వలను పరిశీలించి అధికారులకు సూచనలు అందజేశారు. బ్రిడ్జి పక్కన గల ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. బోరుబావి పక్కన పేరుకపోయిన మురుగు గుంటను వెంటనే పూడ్చాలని ము న్సిపల్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మ న్ సురేశ్, కౌన్సిలర్ నర్సింగ్‌రావు, చిగుళ్లపల్లి రమేశ్‌కుమా ర్, సురేశ్, డాక్టర్ బక్తవత్సలం, రమేశ్‌గౌడ్, ఆర్.నర్సింహు లు, రంగరాజ్, విజయ్‌కుమార్, సర్పంచ్‌ల సంఘం మం డల అధ్యక్షుడు కమలాకర్‌రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, విద్యు త్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...