ఇంటింటికీ మరుగుదొడ్డి, ఇంకుడుగుంత ఉండాలి


Wed,June 26, 2019 12:30 AM

-హరితహారంతో గ్రీనరీ గ్రామంగా మార్చుకుందాం
-ప్రతి నీటి బొట్టును కాపాడుకుందాం,ముందు తరాలకు అందిద్దాం..
-అవగాహన సదస్సులోజేసీ అరుణకుమారి, పీడీ జాన్సన్
కొడంగల్, నమస్తే తెలంగాణ : ఇంటింటికీ మరుగుదొడ్డి, ఇంకుడుగుంత తప్పక నిర్మించుకోవాలని జేసీ అరుణకుమారి, పీడీ జాన్సన్‌లు తెలిపారు. మంగళవారం స్థానిక కేఎస్‌వీ పంక్షన్ హాల్‌లో ఇంటింకీ మరుగుదొడ్డి, ఇంకుడుగుంత, హరితహారంపై కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల పరిధిలోని ప్రజా ప్రతినిధులకు, ఆయా శాఖల అధికారులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆస్తులు సంపాదించి పెట్టడం ముఖ్యం కాదని, స్వచ్ఛమైన ప్రకృతిని అందించేందుకు కృషి చేస్తే అన్నింటా వారికి సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుందని, మరుగుదొడ్డి నిర్మాణాలు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండటంతో పాటు గ్రామం ఆరోగ్య వంతంగా మారుతుందని తెలిపారు.

చెట్లతోనే మానవ మనుగడ..
అడవులు అంతరించడం వల్ల ప్రస్తుతం వాతావరణం కాలుష్యం కాబడి వర్షాలు కురువక నీటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. వాతావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల కాలంగా ప్రతిష్ఠాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, ఇందులో భాగంగా లక్షల సంఖ్యల్లో మొక్కలను నాటి వాటిని సంరక్షస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వర్షాకాలంతో కురుస్తున్న వర్షాలకు గాను ఐదో విడత హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేపడుతుందన్నారు.

ఇంకుడుగుంతలతో గ్రౌండ్ వాటర్ పెంపు
మూడే నాలుగేండ్లుగా వర్షాలు కురువని కారణంగా భూగర్భ జలాలు అడుగంటుకుపోయాయని, తద్వారా ప్రస్తుతం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోంటున్నామని తెలిపారు. పచ్చదనం ఎక్కడ ఉంటే అక్కడ పుష్కలంగా వర్షాలు కురిసి సిరులు చేతికి అందుతాయని తెలిపారు. ప్రస్తుతం వర్షకాలం కాబట్టి నీటిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఇండ్లలో వాడుకునే నీటిని వృథా చేయకుండా ఇంటి పరిసర ప్రాంతంలో ఇంకుడుగుంత నిర్మాణం చేపట్టుకి ఎక్కడి నీటిని అక్కడే ఇంకిపోయే విధంగా చర్యలు చేపట్టుకుంటే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. నీటి పొదుపులో భాగంగా ఉపాధి హామీ పథకం క్రింద 32 రకాలుగా పనులు పొందుపర్చడం జరిగిందని, ఉపాధి హామీ సిబ్బందితో పనులపై అవగాహన పొందాలని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో రూ.482లతో ఇంటి ప్రాంతంలో ఇంకుడుగుంత నిర్మాణం చేసుకోవచ్చని తెలిపారు. పొలాల్లో గ్రామ సభల్లో పీఎం నివేదిక

చదివి వినిపించాలి..
నీటి పొదుపులో భాగంగా ప్రధాన మంత్రి ప్రతి సర్పంచ్‌కు ప్రత్యేకంగా ఉత్తరాన్ని రాయడం జరిగిందని, దీన్ని జిల్లా కలెక్టర్ తెలుగులో తర్జుమా చేసి సర్పంచ్‌లకు అందించినట్లు తెలిపారు. 26వ తేదీ బుధవారం రోజు ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సభలను ఏర్పాటు చేసి పీఎం లేఖను చదివి వినిపించాలని సూచించారు. పక్కజిల్లాలు మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణంతో ఓడీఎఫ్ కాబడ్డాయని, మన జిల్లాలో 50 శాతం గ్రామాలు మాత్రమే ఓడీఎఫ్ అయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఎల్లమ్మ, వైస్ ఎంపీపీ నర్సిములు, ఏపీడీ వేణుగోపాల్,ఎంపీడీవో సుజాత, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలతో పాటు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...