జిల్లాను ఓడీఎఫ్‌గా మారుద్దాం


Wed,June 26, 2019 12:29 AM

-పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
-అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలి
-కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా
డ్యాంలు, ఇంకుడుగుంతలు, పారంపాండులు తోడ్పడతాయని పేర్కొన్నారు. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ఒక స్మశానవాటిక ఏర్పాటు చేయాలని సూచించారు. నూతన పంచాయతీరాజ్ చట్టంపై సర్పంచ్‌లు, కార్యదర్శులు పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పరచుకొని ప్రజలను చైతన్యవంతం చేసి గ్రామాల అభివృద్దికి కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ అరుణకుమారి మాట్లాడుతూ స్వచ్చమైన ప్రకృతిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పీడబ్ల్యూ జాన్సన్ మాట్లాడుతూ జిల్లాలో 2018-19 సంవత్సరంలో 14 వేల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టగా, రెండున్నరేండ్లల్లో 16వేల మరుగుదొడ్లు నిర్మించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, జిల్లా అటవీ శాఖాధికారి వేణుమాధవరావు, ఎంపీడీవోలు, తహసీల్దార్‌లు, గ్రామపంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శులు పాల్గొన్నారు.

ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతలు తప్పనిసరి : కలెక్టర్ మస్రత్‌ఖానమ్‌ఆయేషా
వికారాబాద్ టౌన్ : స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్‌లందరు తమ బాధ్యతగా స్వీకరించి మరుగుదొడ్ల పనులను పూర్తి చేసి బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్ధాలని కలెక్టర్ మస్రత్‌ఖానమ్ ఆయేషా పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ భవనంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా స్వచ్ఛ భారత్ (మరుగుదొడ్ల నిర్మాణం), నీటి సంరక్షణ, హరిత హారం కార్యక్రమాలపై వికారాబాద్ నియోజకవర్గ సర్పంచ్‌లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణాలపై సర్పంచ్‌లచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఈ మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని, ఇప్పటి వరకు కూడా జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించలేకపోయామని తెలిపారు. జిల్లాలోని ప్రతి గ్రామానికి తిరిగి ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. సర్పంచ్‌లు తమ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి తీర్మాణాలు చేసి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకొని, వాటిని సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలని తెలిపారు.

హరిత హారం కార్యక్రమం కూడా గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరం కొనసాగుతుందని, ఈ సంవత్సరం కూడా జిల్లాలో 2.75కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యం నిర్దేశించడం జరిగిందన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో 42లక్షల మొక్కలు నాటాలని, చిన్నా, సన్నకారు, ఎస్సీ,ఎస్టీ రైతులకు పండ్ల మొక్కలను పంపిణీ చేస్తున్నామన్నారు. నాటిన మొక్కలకు నీరు పోసి రక్షించేందుకు డబ్బులు కూడా చెల్లించడం జరుగుతుందని సూచించారు. భూ గర్భజలాల మట్టం తగ్గి తీవ్ర నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాబోయే రోజుల్లో సమస్య తీవ్రం కాకుండ ఉండేందుకు ఇప్పటి నుండే భూ గర్భజలాలు పెరిగేందుకు ప్రయత్నాలు చేయాలన్నారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకొని వర్షపు నీటితో పాటు, ఇంట్లో వాడుకునే నీటిని ఇంకుడు గుంతలో పడేటట్లు చూడాలన్నారు.

ఇంకుడు గుంతలు తవ్వి అందులో కంకర, ఇసు నింపాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌అసిస్టెంట్ల సహాకారంతో పనులు చేపట్టి పూర్తి అయ్యేలా చూడాలని సూచించారు. ఇంకుడు గుంతలకు ప్రభుత్వం తరపున రూ.4వేలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలు, ఆసుపత్రులు, దేవాలయాలు, మసీదులు, అన్ని చోట్ల ఇంకుడు గుంతలు తవ్వించాలని సూచించారు. గ్రామాల్లో పరిశుభ్రత కోసం ఇంటింటికి గ్రామ పంచాయతీ సిబ్బంది చెత్త సేకరణ కోసం వచ్చినప్పుడు గృహిణులు తడి చెత్త, పొడిచెత్తను వేరు వేరుగా చేసి అందించాలన్నారు. తడి చెత్తను డంపింగ్‌యార్డులకు తరలించేందుకు తహసీల్దార్లు 10 గుంటల చొప్పున స్థలాన్ని కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఇప్పటి వరకు గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించుకోనివారు వెంటనే మరుగుదొడ్లు నిర్మించుకునేలా చూడాలని, అలాగే ఇంకుడు గుంతలు తవ్వుకొని, భూ గర్భజలాల నీటి మట్టం పెరిగే విధంగా చూడాలన్నారు కార్యక్రమంలో ఆర్డీవో విశ్వనాథం, డీడబ్ల్యూవో జోత్స్న, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ బాబుమోజస్, వికారాబాద్ నియోజకవర్గ మండలాల ఎంపీడీవోలు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...