నట్టల నివారణ మందును తాగించాలి


Wed,June 26, 2019 12:29 AM

-మండల పరిధిలో ఇప్పటి వరకు 5909 గొర్రెలకు, 6300 మేకలకు నట్టల నివారణ మందులు
-జిల్లా పశువైద్యాధికారి డా.వసంత కుమారి
పెద్దేముల్ : జీవాలు ఆరోగ్యంగా ఉండాలంటే వాటికి తప్పనిసరిగా నట్టల నివారణ మందులను తాగించాలని జిల్లా పశువైద్యాధికారి డా.వసంత కుమారి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కందనెల్లితండా, దుగ్గాపూర్ గ్రామాల్లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ చేపట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల జీవాలకు నట్టల నివారణ మందులను తాగించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. జీవాల కాపరులు గొర్రెలకు, మేకలకు తప్పకుండా నట్టల నివారణ మందులను తాగించాలన్నారు. ఈ నట్టల నివారణ మందును జీవాలకు తాగించకపోతే ముఖ్యంగా జీవాలలో బరువు పెరుగక పోవడం, రోగ నిరోధక శక్తి తగ్గడం, ఇతర రోగాలు వ్యాప్తి చెందడం జరుగుతుందని, అందుకోసం ప్రతి రైతు నట్టల నివారణ మందులను తాగించాలన్నారు. ముఖ్యంగా మండల పరిధిలో ఇప్పటి వరకు 5909 గొర్రెలకు, 6300 మేకలకు ఈ మందును తాగించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కందనెల్లితండా, దుగ్గాపూర్ గ్రామాల్లో 256 గొర్రెలకు, 1547 మేకలకు నట్టల మందులను తాగించడం జరిగిందని అన్నారు.

మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఈ నట్టల నివారణ మందు తాగించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని అన్ని గ్రామాల గొర్రెలు, మేకల కాపరులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జీవాల ఆరోగ్యంగా ఉండాలంటే వాటి ఆరోగ్యం దృష్ట వాటికి సంవత్సరంలో నాలుగు సార్లు తప్పని సరిగా నట్టల నివారణ మందును తాగించాలని, అందులో మూడు సార్లు ప్రభుత్వమే ఉచితంగా నట్టల మందును పంపిణీ చేస్తుందని జిల్లా పశువైద్యాధికారి డా.వసంత కుమారి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, మండల పశువైద్యాధికారి డా.వెంకటరాజు, చంద్రశేఖర్, శేఖర్, నరేందర్, శ్రీనివాసులు, పద్మమ్మ, ఆయా గ్రామాల రైతులు, తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...