మొక్కల సంరక్షణపై దృష్టి పెట్టాలి


Mon,June 24, 2019 11:24 PM

కొడంగల్, నమస్తే తెలంగాణ : పర్యావరణాన్ని పరిరక్షించే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నాలుగేండ్లుగా హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది. హరితహారంలో భాగంగా ఈ ఏడాది జిల్లా పరిధిలో 1.94 కోట్ల మొక్కలు నాటాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్ణయించింది. నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా నర్సరీల్లో మొక్కలను సిద్ధంగా ఉంచారు. గత ఏడాది మొక్కల లభ్యతలో కొంత వరకు ఇబ్బందులు ఎదురు కావడం వల్ల ఈ ఏడాది గ్రామానికో నర్సరీ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో ప్రతి గ్రామంలో గ్రామానికి సరపడ మొక్కలను పెంచి హరితహారానికి సిద్ధం చేశారు. పండ్ల మొక్కలే కాకుండా ఇంటి ఆవరణలొ, పెరటి మొక్కలపై అధికంగా ప్రాధాన్యత కల్పించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ చేపట్టాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 1.94 కోట్లు కాగా అటవీ శాఖ ఆధ్వర్యంలో 81లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది మొత్తంగా 36 లక్షల మొక్కలు నాటగా అందులో 39 శాతం మేరకు బతికాయని అధికారులు తెలిపారు.

జూన్ మాసంలో వర్షాలు లేని కారణంగా ఆలస్యమవుతుందని, జూలై మాసంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. అయితే గతేడాది అటవీ శాఖ, డీఆర్‌డీఏ, ఉద్యానవన శాఖలతో పాటు అన్ని శాఖనుల భాగస్వామ్యం చేసి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. మొక్కలు నాటిన అనంతరం వాటిని సంరక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో హరితహారంలో భాగంగా మొక్కలను నాటేందుకు గుంతలను తీసే ప్రక్రియ నుంచి మొక్కలు నాటే ప్రక్రియ వరకు ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేశారు. ఈ ఏడాది ప్రధానంగా ఇంటి పరిసర ప్రాంతంల్లోని మొక్కలతో పాటు పండ్ల మొక్కలను నాటేందుకు గాను ప్రాధాన్యత కల్పిస్తున్నారు. టేకు, ఈత, వెదురు, నల్లమద్ది, తెల్ల మద్ది, చింత తదితర మొక్కలను నాటేందుకు ప్రాధాన్యతనివ్వనున్నారు. అదేవిధంగా గత ఏడాది నాటిని మొక్కల్లో 39 శాతం మేరకు మొక్కలు బతుకడంతో ఈ ఏడాది మొక్కలను నాటడంతోపాటు సంరక్షణ చర్యలు చేపట్టేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. పర్యావరణాన్ని పెంచడంతో పాటు రాష్ర్టాన్ని ఆకుపచ్చ తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే..
తెలంగాణకు హరితహారంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో1.94 కోట్ల మొక్కలను, అటవీ శాఖ ఆధ్వర్యంలో 81లక్షల మొక్కలను నాటాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 460ల్లో మొక్కలను సిద్ధంగా ఉంచారు.

తెలంగాణకు హరితహారంలో భాగంగా రాహదారులకు ఇరువైపులా మొక్కలను నాటేందుకు రోడ్లు, భవనాల శాఖ అధికారులు జిల్లా యంత్రాంగం ప్రణాళికలను రూపొందించారు. అటవీ శాఖ, రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటనున్నారు. రహదారులకు ఇరువైపులా వేప, రావి, కానుగ, చింత తదితరద మొక్కలను నాటుతున్నారు. ఇందుకు గాను నర్సరీల్లో మొక్కలను సైతం సంబంధి అధికారులు సిద్ధం చేశారు. కాగా ఈ ఏడాది కొత్తగా గెలుపొందిన సర్పంచ్‌లకు, పంచాయతీ కార్యదర్శులకు పూర్తి బాధ్యతలను అప్పగించారు. ఇందులో భాగంగా గ్రామానికి ఓ నర్సరీ పథకం క్రింద ప్రతి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తప్పకుండా నర్సరీని పెంచే ప్రణాళికలను చేపట్టింది. కాబట్టి జిల్లా పరిధిలో 460 నర్సరీలు ఏర్పడ్డాయి. నర్సరీ పెంపకానికి ప్రత్యేంగా ఎండ తీవ్రతల నుంచి మొక్కలను సంరక్షించేందుకు గాను ఉదయం, సాయంత్రం నీటిని అందించేందుకు వనసేవకులను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఎండ తీవ్రత అధికంగా ఉండటం వల్ల ప్రతి నర్సరీకి నెట్‌షెడ్‌లను అందించింది. కాబట్టి ఈ ఏడాది మొక్కలు సంపూర్ణంగా నర్సరీల్లో పెరిగి హరితహారం కార్యక్రమానికి పెద్ద ఎత్తన మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ప్రతి గ్రామ విస్తీర్ణాన్ని బట్టి మొక్కల పెంపకం లక్ష్యంగా చేపట్టింది. గ్రామ పంచాయతీ పరిధిలో ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. క్షేత్రస్థాయిలో ఉండే వారి ద్వారా మొక్కలు సంరక్షించబడతాయనే నమ్మకంతో ప్రభుత్వం ఈ ప్రణాళికను చేపడుతుంది. ప్రతి నర్సరీల్లో 30 నుంచి 70 వేలకు పైగా మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles