నేడు హరితహారం, మరుగుదొడ్లపై సదస్సు


Mon,June 24, 2019 11:24 PM

కొడంగల్, నమస్తే తెలంగాణ : ఐదో విడుత హరితహారం కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం పట్టణంలోని కేఎస్‌వీ ఫంక్షన్ హాల్‌లో నేడు హరితహారం, మరుగుదొడ్లు, నీటి పొదుపు అంశాలపై కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాలకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశామని ఎంపీడీవో సుజాత తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఐదో విడుత హరితహారం, మరగుదొడ్ల నిర్మాణాలు, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నీటిని ఏవిధంగా కాపాడుకోవాలి, నీటి ఎద్దడిని ఏవిధంగా ఎదుర్కోవాలి, నీటి పొదుపు అంశాలపై అధికారుల సమావేశాన్ని పట్టణంలోని కేఏస్‌వీ ఫంక్షన్ హాల్‌లో 11 గంటలకు ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా, డీఆర్‌డీఏ పీడీ జాన్సన్, డీఆర్‌వో మోతీలాల్ హాజరు కానున్నారని తెలిపారు. మూడు మండలాల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు విధిగా హాజరు కావాలని సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ మోహన్‌లాల్, ఏపీవో రాములు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...