మరుగుదొడ్ల నిర్మాణంతో మహిళలకు ఆత్మగౌరవం


Mon,June 24, 2019 11:24 PM

కొడంగల్, నమస్తే తెలంగాణ : మరుగుదొడ్ల నిర్మాణం..ఆరోగ్యంతో పాటు మహిళ ఆత్మగౌరవం ముడిపడి ఉందని సోమవారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల నుంచి పట్టణలోని అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ కలెక్టర్, డీసీవో ఆదేశానుసారంగా స్వచ్ఛ భారత్‌లో భాగంగా స్వచ్ఛ గ్రామీణ మిషన్, స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో మరుగదొడ్ల నిర్మాణాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆరుబయట మల మూత్ర విసర్జనల వల్ల అంటురోగాల బారిన పడాల్సి ఉంటుందన్నారు. వ్యక్తి గత మరుగదొడ్లతో ఆరోగ్యాలను కాపాడుకోవచ్చని తెలిపారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుకునే దిశగా ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణాలు చేపట్టుకోవాలని తెలిపారు.

ఇది మన కోసం చేడపడుతున్న కార్యక్రమం కాబట్టి మనం పూర్తి అవగాహన కల్పించుకొని మరుదొడ్ల నిర్మాణాలు చేసుకోవాలని తెలిపారు. ఆరుబయట మల మూత్ర విసర్జన వల్ల చిన్నారులు, వృద్ధులకు ప్రాంణాతక అంటురోగాలు వచ్చే అవకాశం ఉంటుందని మరుగుదొడ్లను నిర్మించుకోండి... ఆరోగ్యాలను కాపాడుకోండి అని నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

బొంరాస్‌పేటలో..
బొంరాస్‌పేట : మండలంలోని అన్ని గ్రామాల్లో వందశాతం మరుగుదొడ్లను ఈ నెలాఖరులోగా నిర్మించాలన్న గడువు సమీపిస్తుందని పంచాయతీ కార్యదర్శులు, మండలస్థాయి నోడల్ అధికారులు లక్ష్య సాధనకు కృషి చేయాలని ఎంపీడీవో హరినందనరావు అన్నారు. మండలంలో మరుగుదొడ్ల నిర్మాణం ప్రగతిపై సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మరో వారం రోజులు పనుల్లో వేగం పెంచితే అన్ని గ్రామాలు ఓడీఎఫ్ గ్రామాలుగా మారుతాయని అన్నారు. అధికారులకు ఇచ్చిన లక్ష్యం మేరకు ఇంటింటికీ వెళ్లి మరుగుదొడ్డి తప్పక నిర్మించుకునేలా ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి కూడా వెంటనే బిల్లులు చెల్లించాలని ఎంపీడీవో సూచించారు. కార్యక్రమంలో ఏపీవో రజనీకాంత్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...