కేసులు ఛేదించడంలో ఉన్నతాధికారుల సలహాలు తీసుకోవాలి


Mon,June 24, 2019 11:23 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : కేసులను ఛేదించడంలో ఉన్నతాధికారుల సలహాలు తీసుకొని పకడ్బందీగా విధులు నిర్వహించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ తెలిపారు. సోమవారం రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమైన పోలీసు సేవలను అందించాలన్న ఆదేశాల మేరకు వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అదే విధంగా ఫిర్యాదుల దినోత్సవాన్ని నిర్వహించి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ నారాయణ మాట్లాడుతూ స్టేషన్ రైటర్స్, వీకాఫ్ రైటర్స్ కేసుల నమోదును పకడ్బందీగా చేపట్టాలన్నారు. క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సీసీఆఫ్ పంచనామా, సీసీటీఎన్‌ఎస్ ప్రాజెక్టు అప్‌డేడ్స్, ఈ-పిట్టి కేసులను సరైన విధంగా నిర్వహించాలని సూచించారు. అధికారులు కేసులు నమోదు చేస్తున్నప్పుడు పాటిస్తున్న విధి విధానాలపై సరైన విధంగా పద్ధతి ప్రకారం చేయాలన్నారు. ఫిర్యాదు దారులపై నమ్మకంగా, మర్యాదపూర్వకంగా ఉంటూ బాధితులకు న్యాయం జరిగే విధంగా పని చేయాలని సూచించారు. నమోదుఅయిన కేసుల్లో నేరస్తులకు శిక్ష పడే విధంగా కేసులు పరిశోధన చేసి సరైన సాక్షాలను కోర్టులో ప్రవేశపెట్టాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌లో రికార్డులను సక్రమంగా మెయింటెన్ చేయాలని తెలిపారు. వారాంతపు సెలవులను త్వరలోనే జిల్లాలో అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. సిబ్బంది పనితీరును మరింత మెరుగుపర్చుకొని విధులను సక్రమంగా నిర్వహిస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఫిర్యాదుల దినోత్సవానికి కుటుంబ కలహాలు, భూ తగాదాలు, తదితర విషయాలపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వీటన్నింటిని ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని తెలిపారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...