సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు చెక్‌పవర్


Mon,June 24, 2019 01:42 AM

బషీరాబాద్: గ్రామ పంచాయతీల సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ కల్పిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు (గెజిట్ నోటిఫికెషన్) జారీ చేసింది. దీంతో పాటు పంచాయతీరాజ్ చట్టంలో మార్పులకు నిర్దేశించిన అంశాలపైనా ఆదేశాలు ఇచ్చింది. ఇవన్ని ఈ నెల 17 నుంచి అమలులోకి వస్తాయి. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం గ్రామ పంచాయతీల నిధులకు సంబంధించిన చెక్‌పవర్ సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు ఉమ్మడిగా ఉంటుంది. ఇంతకు ముందు సర్పంచ్, కార్యదర్శకి కలిపి ఉండేది. పంచాయతీ నిధులు ఆడిటింగ్ సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి చేయాలి. గతంలో ఈ బాధ్యత కార్యదర్శిదే. నిర్ణీత కాలంలో ఆడిటింగ్ చేయని సర్పంచ్, కార్యదర్శులను బాధ్యతల నుంచి తొలిగించబడుతారు. పంచాయతీ కార్యదర్శి ప్రతినెలా తన పనితీరును వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి. విఫలమైన కార్యదర్శిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ప్రతి సమావేశ తీర్మానాలను కార్యదర్శి విధిగా నోటీసు బోర్డుపై రాయించడంతో పాటు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. లే అవుట్లు, భవననిర్మాణ అనుమతులకు సంబంధించిన ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపోందిస్తుంది. గ్రామసభల్లో ఉండాల్సిన కోరం (సభ్యుల సంఖ్య)ను కూడా నోటీసు పై రాయాలి. 500 వరకు ఓటర్లు ఉండే పంచాయతీల్లో గ్రామసభకు కనీసం 50 మంది హాజరుకావాలి. వెయ్యి లోపు ఓటర్లు ఉంటే 75 మంది, 3000 వరకు 150 మంది, 5వేల వరకు 200 మంది, 10 వేల వరకు 300 మంది గ్రామసభకు హాజరు ఉండాలి.
ప్రత్యేక ట్రైబ్యునల్..
బాధ్యలు, విధులు సరిగా నిర్వర్తించని సర్పంచ్, కార్యదర్శుల తొలిగింపు విషయమై ఫిర్యాదులు, అప్పీళ్లు కోసం ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ముగ్గురు సభ్యులుంటారు. వచ్చిన ఫిర్యాదులు, అప్పీళ్లను మూడు నెలల్లోగా పరిష్కరించాలి. గరిష్ఠంగా ఆరు నెలలు మించి సమయం తీసుకోరాదు. ట్రైబ్యునల్ తీర్పుపై మళ్లీ ప్రభుత్వానికి అప్పీల్‌కు వెళ్లవచ్చు. ట్రైబ్యునల్ తీర్పులకు సంబంధించి కోర్టులకు ఎలాంటి అధికారం ఉండబోదు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...