ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాకు కుట్టుమిషన్ల పంపిణీ


Mon,June 24, 2019 01:42 AM

ధారూరు : ఆత్మ హత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు వారి కుటుంబాలకు కుట్టుమిషన్ లను పంపీణి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా అన్నారు. ఆదివారం ధారూరు మండల పరిధిలోని స్టేషన్ ధారూరులో ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా వాల్మీకి ఫౌండేషన్, సెక్రెడ్ స్పెస్‌ల ఆధ్వర్యంలో 12 వ వాల్మీకి ఫౌండేషన్ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు కుట్టుమిషన్ లను టీవీయాంకర్ అనసూయతో కలిసి పంపిణీ చేశారు. ధారూరు మండల పరిధిలోని ఆయా పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తాకాలు, ఆటలు ఆడేందుకు విద్యార్థులకు క్రికెట్ కిట్, భ్యాగులు అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ హరీశ్‌శ్‌కుమార్ గుప్తా మాట్లాడుతూ కష్టపడితే సాధించలేనిది లేదని, ప్రతి ఒక్కరూ కష్టాలను అధిగమించి విజయాలను సొంతం చేసుకున్నవారే ఉన్నారన్నారు. ఉన్నదాంట్లోనే సంతృప్తిగా ఉండి గుండె నిబ్బరం చేసుకొని ఆత్మైస్థెర్యంతో స్వయం ఉపాధి వైపు ముందుకు సాగాలన్నారు. వాల్మీకి ఫౌండేషన్ అధ్యక్షుడు గణేశ్ మాట్లాడుతూ త్వరలోనే 5 ఎకరాల విస్తీర్ణంలో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సుమారుగా 40 మంది మహిళలకు కుట్టుమిషన్‌లను అందజేశామని వారు తెలిపారు. సుమారు రూ.6లక్షల విలువగల వస్తువులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. అనంతరం టీవీ యాంకర్ అనసూయ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి ఉన్నత చదువులు చదువాలన్నారు. చిన్ననాటి నుంచే క్రమ శిక్షణతో చదివి మంచి ఫలితాలు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో సెక్రెడ్ స్పెస్ వ్యవస్థాపకురాలు నయనాతార, గణేశ్ వాల్మీకి, కిషాల్ వాల్మీకి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...