నేడు టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన


Mon,June 24, 2019 01:41 AM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : వికారాబాద్ జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి నాగేందర్‌గౌడ్ తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు వికారాబాద్ ఎమ్మెల్యే అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. ఇందుకు సంబంధించి ఆదివారం మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఇక్కడ స్థలాన్ని పరిశీలించారని వివరించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఎంపీ రంజిత్‌రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు యాదయ్య, నరేందర్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, రాష్ట్ర వైద్య మౌలిక వసతుల కల్పన చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి హాజరవుతారని తెలిపారు. కార్యక్రమానికి జిల్లా స్థాయి చైర్మన్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కావాలని సూచించారు. కార్యక్రమం ఉదయం 10 గంటలకు వికారాబాద్ పట్టణంలోని ఎల్‌ఐసీ ఆఫీస్ ముందు ఉద్యానవన తోటలో జరుగుతుందని తెలిపారు. అదే విధంగా వికారాబాద్ పట్టణంలో నూతనంగా కోటి రూపాయలతో ఏర్పాటు చేసిన మండల కార్యాలయాన్ని కూడా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...