కల్యాణలక్ష్మితో నిరుపేదల ఇండ్లల్లో కల్యాణ కాంతులు


Sun,June 23, 2019 05:11 AM

వికారాబాద్ , నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ నిరుపేదల పెండ్లిళ్లకు ప్రభుత్వ సహాయం అందే విధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తీసుకొచ్చి కొండంత అండగా నిలుస్తున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇంద్రానగర్, రామయ్యగూడ, రాజీవ్‌గృహకల్ప వార్డుల్లో కల్యాణలక్ష్మి చెక్కులను అందించి, కాలనీ సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేదల పెండ్లిళ్లకు ఆసరాగా నిలువాలని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తీసుకొచ్చి సహాయం చేస్తున్నారని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లతో పేదలు పెండ్లిళ్లు చేసేందుకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని తెలిపారు. ఎంతటి పేదవారైనా ఇక్కడక్కడ డబ్బులు సదురుకొని ఆ డబ్బులతో పెండ్లిళ్లు చేసి కల్యాణలక్ష్మి చెక్కులు వచ్చాక వాటిని చెల్లించి సంతోషంగా ఉంటున్నారని వివరించారు. సీఎం కేసీఆర్ నిరుపేదల పెండ్లిళ్లకు ప్రభుత్వ సహాయం అందించి వారిలో మనోధైర్యాన్ని నింపి కుటుంబ పెద్దగా నిలుస్తున్నారని చెప్పారు.
అనంతరం రామయ్యగూడ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడి సరైన విధంగా విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదుగాలని సూచించారు. రాజీవ్ గృహకల్ప, ఇందిరానగర్‌లో మురుగు నీటి కాలువలను పరిశీలించి కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేదలు నివసిస్తున్న కాలనీల్లో కనీస సౌకర్యాలు కల్పించడమే కాకుండా సమస్యలు తీర్చాలని మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం వికారాబాద్ పట్టణంలోని మార్కెట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన హైలెస్ ఫిష్ దుకాణాన్ని ఎమ్మెల్యే ఆనంద్ ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్ రాజమల్లు, అనంత్‌రెడ్డి, చిగుళ్లపల్లి రమేశ్‌కుమార్, డాక్టర్ బక్తవత్సలం, రత్నం, లాలయ్య, ఆర్.నర్సింహులు, సత్యనారాయణ, కృష్ణారెడ్డి, నవీన్, నర్సింహులు, మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, కౌన్సిలర్ సుధాకర్‌రెడ్డి, రంగరాజ్, సుభాశ్ ఉన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...