మహిళలకు రక్షణ కల్పించాలి


Sun,June 23, 2019 05:11 AM

మొయినాబాద్ : మహిళలకు రక్షణ కల్పించాలని స్వామి వారిని ప్రార్థిస్తూ చిలుకూరు బాలాజీ ఆలయంలో అర్చకులు వినూత్న రీతిలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. మూడు రోజులు క్రితం వరంగల్‌లో ఓ చిన్నారిపై జరిగిని అఘాయిత్యంపై ఆలయ అర్చకులు స్పందిస్తూ శుక్రవారం మూడు గోమాతలతో ఆలయ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. ఒక్కో గోమాతను ఆలయ గర్భగుడి చుట్టూ మూడు ప్రదక్షణలు చేయించారు. అదే విధంగా ఆలయాన్ని వచ్చిన మహిళ భక్తులు కూడ ప్రత్యేకంగా గోమాతలతో పాటు ప్రదక్షణలు చేసి మహిళలకు రక్షణ కల్పించాలి స్వామి అంటూ ప్రార్థనలు చేశారు. వరంగల్‌లో చిన్నారిపై జరిగినటువంటి అఘాయిత్యాలు మహిళలపై మళ్లీ జరగకుండ చూడు తండ్రీ అంటూ స్వామి వారికి ప్రత్యేకంగా వేడుకున్నారు. మహిళల రక్షణ కోసం ఆలయంలో వినూత్న రీతిలో ప్రత్యేక ప్రార్థనలు చేయడంతో భక్తుల నుంచి విశేష స్పందన లభించింది.

చిన్నారిపై అఘాయిత్యాలు జరగడం చాలా విచారకరం..
వరంగల్‌లో చిన్నారిపై జరిగిన అఘాయిత్యం మానవ సమాజాన్ని కుదిపివేసిందని,మనుషలు మృగాల కంటే హీనంగా ప్రవర్థించి మానవ సమాజం తలవంచుకుని సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వరంగల్‌లో చిన్నారి పట్ల ఓ వ్యక్తి మృగంలా ప్రవర్తించి వయస్సుతో నిమిత్తం లేకుండా అఘాయిత్యానికి ఒడిగట్టడంతో నేడు మనిషి అనేవాడు జంతువు కంటే హీనంగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. తెలివి తేటలు లేని జంతువుల అయినా ఓ క్రమ పద్ధతిలో శృంగారంలో పాల్గొంటే అన్ని తెలివి తేటలు ఉన్న మానవుడు జంతువు కన్నా అధ్వానంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. అన్ని తెలివి తేటలు ఉన్న మానవుడు వాయివరుస లేకుండా వయస్సుతో పని లేకుండా బలవంతంగా అఘాయిత్యాలకు పాల్పడి మానవ సమాజానికి మచ్చ తెచ్చిపెడుతున్నారని అన్నారు. సమాజంలో మంచి వాతావరణం నెలకల్పాలని శ్రీకృష్ణావతారం కంటే ముందు గోమాత భూదేవి రూపంలో విష్ణుమూర్తిని ప్రార్థించడంతో సమాజంలో మంచి వాతావరణం నెలకొన్నదని చెప్పారు. పురాతన శాస్ర్తాన్ని బట్టి ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలు జరుగకుండా కాపాడు స్వామి అంటూ శనివారం ఆలయంలో మూడు గోమాతలచే గర్బగుడి చుట్టు మూడు ప్రదక్షణలు చేయించామని అన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా కాపాడు తండ్రీ అని స్వామి వారికి ప్రత్యేక ప్రార్థనలు చేశామని తెలిపారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...