మరుగుదొడ్ల నిర్మాణంతో ఆరోగ్యం


Sun,June 23, 2019 05:10 AM

కొడంగల్, నమస్తే తెలంగాణ : వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకొని ఆరోగ్యాలను కాపాడుకోవడంతో పాటు స్వచ్ఛ మండలంగా ప్రకటించుకుందామని ఈవో పద్మ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, జీసీపీఎస్ పాఠశాలల విద్యార్థులు శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించి మరుగుదొడ్ల ప్రాముఖ్యతలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఆరుబయట మల మూత్ర విసర్జన చేయడం వల్ల క్రిమి, కీటకాలు వాలి అవి ఇంట్లోని ఆహార పదార్థాలపై వాలితే ప్రాంణాంతకరమైన అంటురోగాలు ప్రబలే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు తెలిపారు. వ్యక్తి గత మరుగుదొడ్లు తప్పక నిర్మించుకోవాలని, ఇందుకు గాను ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జీసీపీఎస్ పాఠశాల హెచ్‌ఎం రాములుతో పాటు ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ యాదమ్మ, అరుణ, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ, విద్యార్థి బృందం పాల్గొన్నారు.

మరుగుదొడ్ల నిర్మాణంపై అవగాహన ర్యాలీలు
బొంరాస్‌పేట : అన్ని గ్రామాల్లో ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని కోరుతూ మండలంలోని వివిధ గ్రామాల్లో పాఠశాల విద్యార్థులు శనివారం ర్యాలీలు నిర్వహించారు. నినాదాలు చేసుకుంటూ వీధులగుండా తిరిగారు. మండల కేంద్రంలో ఉన్నత పాఠశాల విద్యార్థులు భూలక్ష్మి దేవాలయం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. బాపల్లితండాలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు పాపిరెడ్డి, గోపాల్ మరుగుదొడ్ల నిర్మాణంపై అవగాహన కల్పించారు. ఎస్‌బీఎం పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఇంటింటికీ తప్పక మరుగుదొడ్డి నిర్మించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...